Chiranjeevi : మీతో స్క్రీన్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. సల్మాన్‌పై మెగాస్టార్ ట్వీట్..

ప్రస్తుతం మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటించనున్నారు. తాజాగా.........

Chiranjeevi : మీతో స్క్రీన్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. సల్మాన్‌పై మెగాస్టార్ ట్వీట్..

Salman

 

God Father :  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు అరడజనుపైగా సినిమాలు చిరంజీవి చేతిలో ఉన్నాయి. చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. అంతే కాక ఒకేసారి మూడు ప్రాజెక్టుల షూటింగ్స్ చేస్తున్నారు చిరు. మెహర్ డైరెక్షన్లో ‘భోళా శంకర్’, మోహన్ రాజా డైరెక్షన్లో ‘గాడ్ ఫాదర్’, బాబీ దర్శకత్వంలో మరో సినిమా.. ఇలా ఒకే సరి మూడు సినిమాలని సెట్స్ మీద పెట్టాడు మెగా స్టార్.

 

ప్రస్తుతం మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హట్ అయిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతుంది. ఇందులో నయనతార ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటించనున్నారు.

Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ ఆ పాటలో ఉన్న వాళ్లంతా ఉక్రెయిన్‌లే.. నాకు తోచిన సహాయం చేశాను..

తాజాగా జరుగుతున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ జాయిన్ అయ్యాడు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ కి పుష్పగుచ్చం అందచేసి గ్రాండ్ వెల్కమ్ తెలియచేసారు. సల్మాన్ కి పుష్ప గుచ్చం ఇస్తున్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసి.. ”మీరు ఈ సినిమాలో జాయిన్ అవ్వడం అందరిని ఉత్తేజపరిచింది. మా ఉత్సాహం మీ రాకతో మరింత రెట్టింపు అయింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో మీ పాత్ర ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు” అంటూ ట్వీట్ చేశారు.