Modi Government : పైరసీ కట్టడికి సినిమాటోగ్రఫీ చట్టం.. కేంద్రం కీలక నిర్ణయం!

సినిమా పరిశ్రమలోని సమస్యలను పరిష్కారించేలా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం. సినిమాటోగ్రఫీ చట్టం తీసుకు వచ్చేందుకు నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో..

Modi Government : పైరసీ కట్టడికి సినిమాటోగ్రఫీ చట్టం.. కేంద్రం కీలక నిర్ణయం!

Central Government bring Cinematography Act to prevent piracy

Modi Government : సినిమా ఇండస్ట్రీలో పైరసీ అన్నది ఒక వీడని భూతంలా తయారు అయ్యింది. ఎన్ని చర్యలు తీసుకున్నా పైరసీని మాత్రం అరికట్టలేక పోతున్నారు. ఇక దీని గురించి స్టార్ హీరోలు సైతం ఫైట్ చేసిన సంఘటనలు మనం చూశాం. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సైతం దీని పై పోరాటానికి ముందడుగు వేశాడు. అర్జున్ సినిమా విషయంలో ఫిలిం ఛాంబర్ దగ్గర కూర్చొని తన నిరసన వ్యక్తం చేశాడు మహేష్. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అత్తారింటికి దారేది సినిమా అయితే విడుదలకు ముందే డీవీడీ రూపంలో బయటకి వచ్చేసింది.

Kanguva : కేరళలో సూర్య కంగువ షూటింగ్.. షూటింగ్ ఎంత పూర్తి అయ్యిందో తెలుసా?

ఇక ప్రస్తుతం ఆడియన్స్ ఓటిటి కల్చర్ కి అలవాటు పడడంతో దానిని కూడా పైరసీ చేసేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అన్‌స్టాఫుబుల్ విత్ NBK ఎపిసోడ్ కూడా రిలీజ్ కి ముందే పలు వెబ్ సైట్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి షో నిర్వాహకులు జాగ్రత్త తీసుకున్నప్పటికీ అది కూడా పైరసీ అయ్యిపోయింది. సినిమా రంగంలోని సమస్యలు గురించి చిరంజీవి (Chiranjeevi) లాంటి వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రానికి వినిపిస్తూ వచ్చారు.

Irrfan Khan : ఇర్ఫాన్ ఖాన్ చివరి సినిమా రిలీజ్‌కి సిద్దమవుతుంది.. పాటతో తేలు కాటుకు విరుగుడు!

తాజాగా కేంద్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకు రావాలని కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్న పైరసీని కట్టడి చేసేందుకు సినిమాటోగ్రఫీ చట్టం తీసుకు రావాలని మోదీ (Narendra Modi) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లుని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ (Anurag Thakur) తెలియజేశారు. ఈ నిర్ణయం పై దక్షిణ ఉత్తరాది సినిమా పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.