12Th Man: ఓటీటీలో మోహన్ లాల్ సినిమా.. ఫ్యాన్స్ ఆగ్రహం!

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్లలో మోహన్ లాల్ ఒకరు. కంటెంట్, కలెక్షన్ల రెంటి పరంగానూ మలయాళ ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా ఆయనకు సొంతం. మాలీవుడ్లో..

12Th Man: ఓటీటీలో మోహన్ లాల్ సినిమా.. ఫ్యాన్స్ ఆగ్రహం!

12th Man

12Th Man: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్లలో మోహన్ లాల్ ఒకరు. కంటెంట్, కలెక్షన్ల రెంటి పరంగానూ మలయాళ ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూడా ఆయనకు సొంతం. మాలీవుడ్లో కలెక్షన్ల పరంగా మేజర్ రికార్డులన్నీ మోహన్ లాల్ పేరిటే ఉంటాయి. ఇతర భాషల్లో సూపర్ స్టార్లతో పోలిస్తే మోహన్ లాల్‌ను భిన్నంగా నిలబెట్టేది మాత్రం ఆయన ఎంచుకునే కథలు, పాత్రలే. ఇమేజ్ బంధనాలకు దూరం సినిమాలను చేసుకెళ్లే మోహన్ లాల్ కు అలా చేసిన దృశ్యం సినిమానే భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

మోహన్‌లాల్ @60: ప్రత్యేకతను చాటిచెప్పిన 5 నాన్-మళయాళీ సినిమాలు

దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఆ సినిమాలో మోహన్ లాల్ సాధారణ తండ్రిగా అవలీలగా నటించేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా దేశం మొత్తం అన్ని బాషలలో రీమేక్ గా మారడం.. దానికి సీక్వెల్ రావడం.. అది కూడా అంతే హిట్టు.. దృశ్యం 2 కూడా మళ్ళీ అన్ని బాషలలో రీమేక్.. ఇలా ఇదో ప్రాంచైజీగా మారిపోయింది. కాగా.. ఇప్పుడు అదే జీతూ జోసెఫ్-మోహన్ లాల్ కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తుంది. అదే 12Th మాన్.

Mollywood: చిన్న సినిమాలకు అండగా.. ఓటీటీ రంగంలోకి కేరళ ప్రభుత్వం!

ఈ సినిమా మొదలైన దగ్గర నుండే భారీ అంచనాలు నెలకోనగా మోహన్ లాల్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలో విడుదల చేయనున్నట్లుగా తెలియడంతో ఆయన అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు భారీ మొత్తానికి ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో మోహన్ లాల్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

OTT Releases: థియేటర్‌లో స్టార్ మూవీస్.. అయినా తగ్గని ఓటీటీలు!

గతంలో కరోనా పరిస్థితుల కారణంగా దృశ్యం 2 సినిమాను ఓటీటీలో తెచ్చారు. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దేశమంతా సినిమాలు థియేటర్లలో విడుదల అవుతుంటే.. బ్లాక్ బస్టర్ కాంబినేషన్.. దేశం మొత్తం సక్సెస్ సినిమాలు ఇచ్చిన కాంబినేషన్ లో వచ్చే సినిమాను సింపుల్ గా ఓటీటీలో తీసుకురావడం ఏంటని మాలీవుడ్ లో రచ్చ జరుగుతుంది. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు మేకర్స్ థియేటర్లలో తెస్తారా.. లేక ముందే ఒప్పందం ప్రకారం ఓటీటీలోనే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.