MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

క్రికెట్ రంగంలో దేశానికి ఎన్నో విజయాలు మరియు వరల్డ్ కప్ అందించిన ధోని.. ఇప్పుడు సినీ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. ధోని ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై సౌత్ లో ఉన్న పలు భాషల్లో తాను సినిమాలు నిర్మించబోతున్నట్లు తెలియజేశాడు. తాజాగా ధోని తన మొదటి ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు.

MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

dhoni lgm

MS Dhoni : క్రికెట్ రంగంలో దేశానికి ఎన్నో విజయాలు మరియు వరల్డ్ కప్ అందించిన ధోని.. ఇప్పుడు సినీ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. గత ఏడాది దీపావళి నాడు ధోని తన సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసి సినీ కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ధోని ఎంటర్‌టైన్మెంట్స్ పతాకం పై సౌత్ లో ఉన్న పలు భాషల్లో తాను సినిమాలు నిర్మించబోతున్నట్లు తెలియజేశాడు. దీంతో ధోని నిర్మాణంలో పలానా హీరో నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వాస్తు ఉన్నాయి. తాజాగా ధోని తన మొదటి ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు.

MS Dhoni: రాంచీలో టీమిండియా సభ్యులతో ఎంఎస్ ధోని.. వీడియో వైరల్..

లవ్ టుడే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ‘ఇవనా’. ఆ సినిమాలో తన యాక్టింగ్ కి మంచి మార్కులు తెచ్చుకున్న ఇవనా.. ఇప్పుడు ధోని నిర్మాణంలో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో ‘హరీష్ కళ్యాణ్’ సరసన నటించే అవకాశం కూడా ఈ సినిమాతో అందిపుచ్చుకుంది. మూవీ టైటిల్ తో పాటు చిత్ర యూనిట్ ని ప్రకటిస్తూ ధోని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ నదియా, తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించబోతున్నారు.

గతంలో ధోనీని హీరోగా పెట్టి ‘అథర్వ ది ఆరిజిన్’ అనే గ్రాఫిక్ నవలని రూపొందించిన ‘రమేష్ తమిళమణి’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే టైటిల్ ని ఖరారు చేశాడు ధోని. టైటిల్ చూస్తుంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరి క్రికెట్ లో కెప్టెన్ గా జట్టుని విజయాలు దిశగా తీసుకువెళ్లిన ధోని.. సినిమాలో ప్రొడ్యూసర్ గా మూవీని కూడా హిట్టు దిశగా తీసుకు వెళ్లగలడా? లేదా? అనేది చూడాలి.