ఉగాది ట్రీట్ రెడీ..

ఆర్ఆర్ఆర్ - ఉగాది కానుకగా టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : March 24, 2020 / 02:19 PM IST
ఉగాది ట్రీట్ రెడీ..

ఆర్ఆర్ఆర్ – ఉగాది కానుకగా టైటిల్ లోగో మరియు మోషన్ పోస్టర్ విడుదల..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ‘ఆర్ఆర్ఆర్’ అంటే ఏమిటో జక్కన్న ప్రకటించలేదు.

దీనికోసం ఆయన ఈ తెలుగు సంవత్సరాది (ఉగాది)ని ఎంపిక చేసుకున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు, తారక్ అండ్ చరణ్ అభిమానులకు ఉగాది ట్రీట్ రెడీ చేసింది‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఈ సినిమా ఫుల్ టైటిల్‌కి సంబంధించిన లోగో, మోషన్ పోస్టర్‌ను ఉగాది రోజున (బుధవారం) విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా తాజాగా ప్రకటించింది.

Read Also : చిరు ఉగాది స్పెషల్ – సోషల్ మీడియాలోకి ఎంట్రీ

NTR

ఈ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను ఐదు భాషలలో విడుదల చేయబోతున్నారు. తెలుగు లోగో, మోషన్ పోస్టర్ డీవీవీ మూవీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల అవుతుండగా, తమిళ్.. జూనియర్ ఎన్టీఆర్ ఆఫీషియల్ అనే ఛానల్ ద్వారా, హిందీ.. అజయ్ దేవగన్, కన్నడ.. వారాహి, మలయాళం.. ఆల్వేస్ రామ్ చరణ్ అనే యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విడుదల చేయనున్నారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్‌గా ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ఈ మధ్య వార్తలు వినిపించాయి. జక్కన్న ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ ఎలా ఉండబోతోంది అనేది మరికొద్ది గంటల్లో రివీల్ కానుంది. ‘RRR’ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ అప్‌డేట్ ట్విట్టర్‌లో ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. 

Ram Charan