ఇకనుండి మల్టీప్లెక్సుల్లో అంతా డిజిటల్.. అనుమతివ్వండి షోలు వేస్తాం..

  • Published By: sekhar ,Published On : July 23, 2020 / 08:24 PM IST
ఇకనుండి మల్టీప్లెక్సుల్లో అంతా డిజిటల్.. అనుమతివ్వండి షోలు వేస్తాం..

టిక్కెట్లు లేవ్… పక్క పక్క సీట్లు లేవ్. మల్టీప్లెక్స్ అంతా మారిపోయింది. పేపర్‌లెస్ టిక్కెట్లు, దూరందూరంగా సీట్లు, ఒకేసారి ఇంటర్వెల్లు రద్దు… నూరుశాతం శానిటైజేషన్. అన్‌లాక్ 3లో భాగంగా, ఆగస్టు నెలలో ప్రభుత్వం సినిమాలకు అనుమతినిస్తే, మల్టీప్లెక్స్ విధానాలివి. రెస్టారెంట్లలకు, షాపింగ్‌కు జనం వెళ్లడంలేదు. అలాంటిది పెద్ద హాలులో వందలమందితో కలసి సినిమా చూసే ధైర్యం చేయగలరా? ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వ్యాపిస్తోంది. టెంపరేచర్‌ను చూసి కరోనా ఉందో లేదో చెప్పలేం. మరి మల్టీప్లెక్సులు ఎందుకింత ధైర్యం చేస్తున్నాయి? సమాధానముంది.

 

Multiplexసినిమా ప్రదర్శనలకు అనుమితినివ్వాలంటూ మల్టీప్లెక్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పూర్తిగా కాంటాక్ట్ లెస్‌లోనే సినిమా ప్రదర్శనలను నిర్వహిస్తామని కేంద్రమంత్రులుతోపాటు పీఎంఓ, నీతియోగ్‌కు ఇంతకుముందే నివేదికిచ్చింది. చిన్నస్థాయి థియేటర్లలో సెప్టెంబర్‌లోనూ సినిమాలను ప్రదర్శించడం అసాధ్యమే. కరోనా జాడలులేకుండా మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆ సంగతి అందరికీ తెలుసు. Multiplexఅక్కడే PVR Cinemas, INOX, Cinepolis లాంటి మల్టీప్లెక్సులకు ఎడ్వాంటేజ్. automatic seat distancing కోసం ప్రత్యేకంగా ఆల్గోరిథమ్‌ను తయారుచేశారు. రెగ్యులర్ క్లీనింగ్ వుంటుంది. అదే సమయంలో ప్రతి షో తర్వాత ప్రతి హాల్‌ను కెమికల్స్‌తో క్లీన్ చేస్తారు. లాబీ, రెయిలింగ్, డోర్లు కాంటాక్ట్ ఉన్నప్రతిచోటా డిస్‌ఇఫ్టెక్ట్ చేస్తామని అంటున్నారు. ఇక టెంపరేచర్ స్కాన్ చేసిన తర్వాతనే థియేటర్‌లోకి అనుమతి. ప్రపంచస్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకొని, థియేటర్లను నిర్వహిస్తామని మల్టీప్లెక్స్ యజమానులు అంటున్నారు.