Naatu Naatu Song : ఆస్కార్ మనదే.. అదరగొట్టిన నాటు నాటు.. అచ్చతెలుగు పాట చెంతకు ఆస్కార్..

ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. నాటు నాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది........

Naatu Naatu Song : ఆస్కార్ మనదే.. అదరగొట్టిన నాటు నాటు.. అచ్చతెలుగు పాట చెంతకు ఆస్కార్..

Naatu Naatu song from RRR Wins Oscar award keeravani and chandrabose received award on stage

Naatu Naatu Song :  ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. నాటు నాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. రాజమౌళి ఆధ్వర్యంలో చంద్రబోస్ కలంలోని సాహిత్యం, పదునైన పదాలకు కీరవాణి చేతుల్లోంచి వచ్చిన సంగీతం ప్రాణం పోయగా వచ్చిన నాటు నాటు పాట రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గొంతుల్లోంచి బయటకు రాగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులని చరణ్, తారక్ వేయడంతో ప్రపంచమంతా ఊగిపోయింది. ఏకంగా ఆస్కార్ సభ్యులను కూడా నాటు నాటు అంటూ ఊపేసి ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి ఇన్ని రోజులు ఊరించి ఊరించి ఆస్కార్ ఇవాళ మన చేతుల్లోకి వచ్చేసింది.

ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు మన ఇండియన్ టైం ప్రకారం నేడు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి జరుగుతున్నాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమ్మెల్ ఈ వేడుకలకు హోస్ట్ గా చేశాడు. హాలీవుడ్ మాత్రమే కాక దేశ విదేశాల సినీ పరిశ్రమల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఆస్కార్ వేడుకలకు విచ్చేశారు.

మన RRR సినిమా నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్,రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అయిదు పాటలు నామినేట్ అవ్వగా RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వరించింది. ఈ అవార్డుని ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకోగా మొట్టమొదటి ఇండియన్ పాట, మొట్టమొదటి తెలుగు పాటగా ఈ అవార్డు సరికొత్త చరిత్ర సృష్టించింది.

నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో RRR యూనిట్ సంతోషంలో మునిగిపోయింది. చిత్రయూనిట్ సంబరాలు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా RRR యూనిట్ కి, రాజమౌళికి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి, పాటలో, సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయాన్నే దేశమంతా ఓ మంచి వార్త విందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతా. అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రేమికులు నాటు నాటు సాంగ్ ఆస్కార్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక RRR చిత్రయూనిట్ ని దేశ విదేశాల్లోంచి అభిమానులు, అన్ని రంగాల ప్రముఖులు, ప్రజలు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Oscars95 Live updates : 95వ ఆస్కార్ వేడుకలు.. లైవ్ అప్డేట్స్..

రాజమౌళి ఆధ్వర్యంలో మన తెలుగు సినిమాలోని తెలుగు పాట, తెలుగు సాహిత్యం ఇవాళ ప్రపంచంలోనే అత్యుత్తమమైన సినీ వేదికపై గర్వంగా ఆస్కార్ అవార్డు గెలుచుకొని సినీ, కళా రంగంలో మన భారతదేశాన్ని మరింత ఎత్తులో నిలబెట్టింది.