మెగా బ్రదర్ మెగా నిర్ణయం : జబర్దస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు

  • Published By: madhu ,Published On : November 22, 2019 / 12:02 AM IST
మెగా బ్రదర్ మెగా నిర్ణయం : జబర్దస్త్ నుంచి తప్పుకున్న నాగబాబు

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షోల్లో జబర్దస్త్ కామేడీ షో ఒకటి. గురు, శుక్రవారాల్లో ప్రసారమ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు ఎంతగానో అలరిస్తున్నాయి. ఇంత క్రేజ్ తీసుకావడానికి తమ వంతు పాత్ర పోషించిన షో న్యాయ నిర్ణేతలు నాగబాబు, రోజా. కొన్ని రోజులుగా షోపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందించారు. 2019, నవంబర్ 21వ తేదీ గురువారం ఆయనకు సంబంధించిన యూ ట్యూబ్‌లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. షో నుంచి వెళ్లిపోవడం, రెమ్యూనరేషన్ తదితర వివరాలపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. 

‘జబర్దస్త్ ఒక సుదీర్ఘ ప్రయాణం. 2013 నుంచి 2019 వరకు తన ప్రయాణం సాగింది. చాలా హ్యాపీ ఎమోషనల్ జర్నీ. కానీ..తాను బబర్దస్త్ మానేయడానికి ఏవోవో కారణాలు బయటకు వస్తున్నాయి. తనకు ఇష్టం లేక మాట్లాడాల్సి వస్తోంది. ఏదైనా విషయాన్ని వివాదాస్పదం చేయడం ఇష్టం లేదు. జబర్దస్త్‌కు వ్యతిరేకంగా ఇప్పటి వరకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. సపోర్టు చేస్తూ మాట్లాడా. నవంబర్ 22వ తేదీ శుక్రవారం ఏపిసోడ్‌తో జబర్దస్త్‌తో తన ప్రయాణం ముగిసింది. తర్వాత నుంచి కనిపించను. నాకు నేనుగా మానేసే పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఒక కార్యక్రమం అయినా..జర్నీ అయినా..ఎక్కడో ఒక చోట పూర్తి కావాలి. శ్యాం ప్రసాద్ గారితో ఎలాంటి విబేధాలు లేవు. కేవలం అవి ఆలోచనాపరమైన విబేధాలు అనవచ్చు. వ్యాపారానికి సంబంధించనవి.

శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి, ఈటీవీ వారికి కృతజ్ఞతలు. జబర్దస్త్ చేసే సమయానికి నేను ఇబ్బందుల్లో ఉన్నా. అప్పుడున్న పరిస్థితుల్లో షో నాకు చాలా సాయం చేసింది. కామెడీ అంటే చాలా ఇష్టం. నవ్వించే వాళ్లంటే నాకు ఇష్టం. రెమ్యూనరేషన్ విషయంలో వివాదం వచ్చి బయటకు వచ్చానని అందరూ అనుకుంటున్నారు. కానీ, రెమ్యూనరేషన్ అనేది నాకు పెద్ద విషయం కాదు. పారితోషకం అనేది ప్రామాణికం కాదు. మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు. తన స్థాయికి తగిన రెమ్యూనరేషన్ కాదని తెలుసు. ఇది అసలు ఇష్యూ కాదు. ఏడున్నర ఏళ్ల పాటు ప్రయాణించడం సామాన్య విషయం కాదు. ఒక రికార్డు క్రియేట్ చెప్పుకోవాలి. జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చానో రానున్న రోజుల్లో చెబుతాను’. అని నాగబాబు వెల్లడించారు.  
Read More : ఒంటి మీద ఖాకీ యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహాన్ని.. యూనిఫామ్ తీశానా.. ఇక వేటే!