Naga Chaitanya: ఇళయరాజాతో నాగచైతన్య ఫోటో.. వెరీ స్పెషల్ అంటోన్న హీరో!
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతూ ఓ పవర్ఫుల్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

Naga Chaitanya Photo With Ilaiyaraj
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతూ ఓ పవర్ఫుల్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
Naga Chaitanya : నాగచైతన్య పై క్రష్ ఉందంటున్న మజిలీ బ్యూటీ.. పెళ్లి వార్తలు పై క్లారిటీ!
కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ముగించింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ మూవీ సంగీతంపై ఆసక్తి క్రియేట్ అయ్యింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఇళయరాజాను కలిశాడు హీరో చైతూ. ఈ సినిమాకు ఆయన కంపోజ్ చేస్తున్న సంగీతం తనకు ఎన్నో మధురజ్ఞాపకాలను గుర్తుకు చేసిందని ఈ సందర్భంగా చైతూ పేర్కొన్నాడు.
Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో చైతూ మూవీ.. లేనట్టేనా..?
ఇళయరాజాను ఇలా కలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని.. ఈ మూమెంట్‌ను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చైతూ పేర్కొన్నాడు. ఇక ఇళయరాజాతో చైతూ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది. కాగా కస్టడీ చిత్రంలో చైతూ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
Such a big smile on my face meeting the Maestro Ilaiyaraaja sir , his compositions took me through so many journeys in life .. so many times have I played out a scene in my head , pictured a script with his reference .. to now rajasir composing for #custody . Truly grateful !! pic.twitter.com/YVwpoGgN9F
— chaitanya akkineni (@chay_akkineni) February 25, 2023