Naga Chaitanya : సమంతని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను.. సమంత వర్క్ ప్రతీది చూస్తాను..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సమంత గురించి మాట్లాడాడు. నాగ చైతన్య మాట్లాడుతూ.. ''మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఆ విషయాన్ని అందరికి బహిరంగంగానే చెప్పాము. విడిపోయిన తర్వాత................

Naga Chaitanya :  సమంతని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను.. సమంత వర్క్ ప్రతీది చూస్తాను..

Naga Chaitanya spoke about Samantha

Naga Chaitanya :  నాగ చైతన్య, సమంత విడిపోయి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నా ఇప్పటికి మీడియా ముందుకొస్తే వారి విడాకుల గురించే అడుగుతారు. దీనిపై ఇటీవలే నాగ చైతన్య అసహనం వ్యక్తం చేశాడు. ఇక సమంత ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో నాగ చైతన్య మీద ఇండైరెక్ట్ గా బాగానే ఫైర్ అయింది. దీనిపై చైతు ఫ్యాన్స్ సమంతని ట్రోల్ చేశారు కూడా. కానీ చైతు మాత్రం సమంత గురించి పాజిటివ్ గానే చెప్తున్నాడు.

నాగ చైతన్య త్వరలో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చడ్డా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సమంత గురించి మాట్లాడాడు. నాగ చైతన్య మాట్లాడుతూ.. ”మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఆ విషయాన్ని అందరికి బహిరంగంగానే చెప్పాము. విడిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నాము. విడాకులు తీసుకున్నా మాకు ఒకరిపై ఇంకొకరికి గౌరవం ఉంది. సమంతని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. సామ్ చేసే ప్రతి వర్క్‌ని చూస్తూనే ఉంటాను. మేం విడిపోయాక నావి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయినా అందరూ ఇంకా మా విడాకుల గురించే మాట్లాడుతున్నారు” అని అన్నాడు.

Deepika Padukone : ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మా అమ్మ నన్ను అర్ధం చేసుకోవడం వల్లే ఇవాళ ఇలా..

చైతూ చేసిన ఈ వ్యాఖ్యలని అక్కినేని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సమంత చైతూ గురించి నెగిటివ్ గా చెప్పినా చైతన్య మాత్రం సమంత గురించి పాజిటివ్ గానే చెప్తున్నాడు, అది అతని మంచితనం అని కామెంట్స్ చేస్తున్నారు.