Chay Sam Breakup: విడిపోతామని చెప్పిన తర్వాత నాగచైతన్య భారీ ఫంక్షన్‌లో…….

నాగ చైతన్య మాత్రం పబ్లిక్ గానే కాదు సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఒక్క పోస్టు కూడా లేదు. ఎట్టకేలకు దాదాపు ఆరు రోజుల తర్వాత బయటికొచ్చేందుకు నాగ చైతన్య రెడీ అయ్యాడట.

Chay Sam Breakup: విడిపోతామని చెప్పిన తర్వాత నాగచైతన్య భారీ ఫంక్షన్‌లో…….

Naga Chaithanya

Chay Sam Breakup: నాగ చైతన్య – సమంత కొద్ది రోజులుగా మీడియాలో నానుతున్న పేరు. నెలల పాటు వింటున్న రూమర్లకు చెక్ పెడుతూ సోషల్ మీడియా వేదికగా తమ నిర్ణయాన్ని తెలియజేసి విడిపోతున్నామని కన్ఫమ్ చేశారు. ఈ పోస్టులు తతంగం ముగిశాక నాగ చైతన్య మీడియా కంటికి కనిపించలేదు కానీ, సమంతా మాత్రం షూటింగుల్లో బిజీ అయిపోయారు.

నాగ చైతన్య మాత్రం పబ్లిక్ గానే కాదు సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఒక్క పోస్టు కూడా లేదు. ఎట్టకేలకు దాదాపు ఆరు రోజుల తర్వాత బయటికొచ్చేందుకు నాగ చైతన్య రెడీ అయ్యాడట. అది కూడా భారీ ఫంక్షన్ లో అక్టోబర్ 8న చీఫ్ గెస్ట్ గా రానున్నాడు. తమ్ముడు అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఈవెంట్ కోసం అభిమానుల ముందుకు వస్తున్నాడు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాగూ మీడియా ప్రశ్నలు అడగటానికి వీలుండదు. ఎవ్వరికీ బదులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం సాధ్యపడేది ఏంటంటే నాగచైతన్య ముఖం చూసి ఫీలింగ్స్ బట్టి ఊహించుకోవడమే విమర్శకులకు మిగిలి ఉంది. చాలా రోజులుగా ఊరిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ రెడీ అవుతుండగా.. ఈ సినిమా అఖిల్ కు హిట్ తెస్తుందని భావిస్తున్నారంతా.

………………………………………… : రిపబ్లిక్ సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం..

బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ .. GA2 పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో తెరకెక్కింది. అఖిల్ సరసన పూజా హెగ్దే అలరించనున్నారు.