Krishna Vrinda Vihari Trailer: కృష్ణ వ్రింద విహారి ట్రైలర్.. నాగశౌర్య మరో హిట్ కొట్టేలా ఉన్నాడు!
యంగ్ హీరో నాగశౌర్య ఎంచుకునే సినిమాలు ఆడియెన్స్‌ను మెప్పించే విధంగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. అందుకే కథలో విషయంలో ఈ హీరో చాలా జాగ్రత్తగా వెళ్తుంటాడు. తాజాగా కృష్ణ వ్రింద విహారి అనే ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు నాగశౌర్య. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Naga Shaurya Krishna Vrinda Vihari Trailer Released
Krishna Vrinda Vihari Trailer: యంగ్ హీరో నాగశౌర్య ఎంచుకునే సినిమాలు ఆడియెన్స్‌ను మెప్పించే విధంగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. అందుకే కథలో విషయంలో ఈ హీరో చాలా జాగ్రత్తగా వెళ్తుంటాడు. తాజాగా కృష్ణ వ్రింద విహారి అనే ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు నాగశౌర్య. దర్శకుడు అనీశ్ ఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
Naga Shaurya : ‘కృష్ణ వ్రింద విహారి’ గా నాగ శౌర్య..
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో, ప్రేక్షకులను ఇది బాగా అలరిస్తోంది. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి, ఉద్యోగం రిత్యా పట్టణానికి వచ్చి, ఇక్కడ ఒక సూపర్ ఫాస్ట్ అమ్మాయిని ప్రేమించడంతో.. అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు మనకు ట్రైలర్‌లో చూపెట్టారు. ఇక నాగశౌర్య మరోసారి తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
Shirley Setia : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న షిర్లీ సేఠియా
నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ షిర్లే సెటియా హీరోయిన్‌గా నటిస్తోండగా బ్రహ్మాజీ, రాధికా శరత్ కుమార్ వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, ఉషా ముల్పూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.