Bigg Boss 6 Telugu : నాగార్జున సరికొత్త ప్రయోగం.. 24 గంటల పాటు లైవ్!

ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా పని చేస్తానంటున్నారు కింగ్ నాగార్జున..

Bigg Boss 6 Telugu : నాగార్జున సరికొత్త ప్రయోగం.. 24 గంటల పాటు లైవ్!

Nagarjuna

Bigg Boss 6 Telugu: ప్రెజర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా పని చేస్తానంటున్నారు కింగ్ నాగార్జున. ఆరు పదుల వయసులోనూ మూవీస్, యాడ్స్, టీవీ షోలతో క్షణం తీరిక లేకుంగా బిజీగా గడుపుతున్నారాయన. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ తర్వాత వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ షోను నాగ్ హోస్ట్ చెయ్యగా ఫ్యాన్స్, బుల్లితెర ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.

Atrangi Re : టాక్ సూపర్‌హిట్.. కానీ అదొక్కటే మైనస్..

3,4,5 వరుసగా మూడు సీజన్లకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కంటెస్టెంట్లను కంగారు పెడుతూ.. అవసరమైనప్పుడు వాళ్ల మీద కోప్పడుతూ నాగ్ షోను రక్తి కట్టించారు. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు నాగార్జున. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘బిగ్ బాస్’ చెయ్యబోతున్నట్లు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

Radhe Shyam: తెగ నచ్చేసిన ట్రైలర్.. సినిమా ఎలా ఉంటుందో లెక్కలేసుకుంటున్న ఫ్యాన్స్!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బిగ్ బాస్ లవర్స్‌కి థాంక్యూ.. తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ‘బిగ్ బాస్’ ఎపిసోడ్స్ అన్నీ చూసాను.. చేతిలో రాసుకొని కంటెస్టంట్స్‌‌తో మాట్లాడేవాడిని. ‘బిగ్ బాస్’ షో తర్వాత అందరూ మెసేజెస్ పెట్టారు.. ‘బిగ్ బాస్’ ఓటీటీలో చేద్దాం అన్నారు.. ఇది చాలా డిపరెంట్ ఫార్మేట్. ఇది నంబర్ వన్ షో.. అలాగే ఓటీటీలో 24 గంటల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా లైవ్‌లో ఈ షో చెయ్యబోతున్నాం. ‘బంగార్రాజు’ పండుగ లాంటి సినిమా’.. అంటూ తమ సినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది చెప్పకనే చెప్పేశారు కింగ్ నార్జున.