Nani Dasara : అమెరికాలో నాని సరికొత్త రికార్డ్.. మహేష్ తర్వాత నాని ఒక్కడే..
ఇక్కడ మాత్రమే కాకుండా అమెరికాలో కూడా నాని దసరా సూపర్ సక్సెస్ తో సాగిపోతుంది. అమెరికాలో కూడా దసరా సినిమాకి కలెక్షన్స్ అదిరిపోయాయి. మొదటి రోజే 850K డాలర్స్ పైగా కలెక్ట్ చేసిన దసరా రెండో రోజు మధ్యాహ్నానికే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది.

Nani creates new record in US with Dasara Movie after Mahesh Babu
Nani Dasara : నాని(Nani) దసరా(Dasara) సినిమాతో ఈ శ్రీరామనవమికి(Sri Ramanavami) ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. దసరా సినిమా మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. దసరా సినిమా మొదటి రోజే ఏకంగా 38 కోట్లా గ్రాస్, రెండు రోజులకి 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్(Gross Collections) ని వసూలు చేసి సరికొత్త రికార్డు సాధించింది. నాని కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా, నాని కెరీర్ లో చాలా ఫాస్ట్ గా 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా దసరా నిలిచింది.
ఇక్కడ మాత్రమే కాకుండా అమెరికాలో కూడా నాని దసరా సూపర్ సక్సెస్ తో సాగిపోతుంది. అమెరికాలో కూడా దసరా సినిమాకి కలెక్షన్స్ అదిరిపోయాయి. మొదటి రోజే 850K డాలర్స్ పైగా కలెక్ట్ చేసిన దసరా రెండో రోజు మధ్యాహ్నానికే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది. దీంతో నాని దసరా సినిమా కూడా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ మార్క్ క్లబ్ లో చేరింది. ఈ సినిమాతో కలిపి నానికి ఇప్పటివరకు మొత్తం 8 సినిమాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇప్పటివరకు తెలుగు హీరోల్లో మహేష్ బాబుకి మాత్రమే అమెరికాలో ఎక్కువ 1 మిలియన్ డాలర్ సినిమాలు ఉన్నాయి. మహేష్ కి ఏకంగా 11 సినిమాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్ వసూళ్లు సాధించాయి. ఇప్పుడు మహేష్ తర్వాత నాని 8 సినిమాలతో రెండో ప్లేస్ సాధించడం గమనార్హం. దీంతో నాని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మహేష్, నాని తర్వాత తారక్ 7, పవన్ కళ్యాణ్ 6, అల్లు అర్జున్ 5, ప్రభాస్ 4 సినిమాలతో ఉండటం విశేషం. ఈ రికార్డుతో మరోసారి నానికి ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు.
#DhoomDhaamBlockbuster Dasara hits the magical ONE MILLION mark at the USA Box Office 🔥🔥
Super strong bookings and a sensational weekend on cards 🔥💥#Dasara@NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP @saregamasouth pic.twitter.com/oB4j9DiX1U
— SLV Cinemas (@SLVCinemasOffl) March 31, 2023