Dasara Movie: తొలిరోజే భారీ వసూళ్లపై కన్నేసిన దసరా.. కాన్ఫిడెంట్‌గా ఉన్న నాని!
దసరా.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ. ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ సాలిడ్ ప్రమోషన్స్ చేసింది. దసరా మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టడం ఖాయమని తెలుస్తోంది.

Nani Dasara Movie Eyeing On Huge Collections On First Day
Dasara Movie: దసరా.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ. నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు. ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
Dasara Movie: దసరాతో సిల్క్ స్మిత కనెక్షన్.. రివీల్ చేసిన డైరెక్టర్!
ఈ సినిమాను పూర్తి రా అండ్ రస్టిక్ చిత్రంగా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ సాలిడ్ ప్రమోషన్స్ చేసింది. హీరో నాని తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియాలో దసరా మాసివ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో పాటు ‘చమ్కీల అంగీలేసి’ పాట ఇఫ్పటికే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
Dasara Movie: యూఎస్ ప్రీసేల్స్ బుకింగ్స్‌తో దుమ్ములేపుతున్న ‘దసరా’
దసరా మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా హైప్ కారణంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సాలిడ్‌గా జరుగుతున్నాయని.. అటు ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు ట్రెమెండస్ క్రేజ్ రావడంతో అక్కడ కూడా ఈ సినిమా నాని కెరీర్లో బెస్ట్ మూవీగా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది. మరి దసరా చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అనేది మున్ముందు చూడాలి.