Nani : దసరా షూటింగ్ కంప్లీట్.. నాని కొత్త లుక్ అదిరిపోయింది..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'దసరా'. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్ని తెలియజేస్తూ హీరోహీరోయిన్లు నాని అండ్ కీర్తి తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Nani : దసరా షూటింగ్ కంప్లీట్.. నాని కొత్త లుక్ అదిరిపోయింది..

nani dasara shooting complete

Nani : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దసరా’. 19 కాలం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని రఫ్ అండ్ రస్టిక్ గా కనిపించబోతున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత ఒద్దెల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, సాయి కుమార్, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, మీరా జాస్మిన్, పూర్ణ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.

Nani 30 : మరోసారి తండ్రి పాత్రలో నాని.. ఆకట్టుకుంటున్న నాని30 గ్లింప్స్!

సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక షూటింగ్ కంప్లీట్ అయిన విషయాన్ని తెలియజేస్తూ హీరోహీరోయిన్లు నాని అండ్ కీర్తి తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిన్నటి వరకు గుబురు గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించిన నాని. ఇప్పుడు క్లీన్ షేవ్ తో లవర్ బాయ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. కాగా ఈ లుక్ తన తదుపరి సినిమా కోసం అని తెలుస్తుంది.

తన 30వ సినిమాని ఒక వీడియో గ్లింప్స్ ద్వారా ఇటీవల నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ గ్లింప్స్ లో నాని నెక్స్ట్ సినిమాకి గడ్డం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మూవీలో నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో జెర్సీ సినిమాలో నాని ఫాదర్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాని డైరెక్షన్ చేస్తున్నాడు. మలయాళ బ్లాక్ బస్టర్ ‘హృదయం’ సినిమాకు సంగీతం అందించిన ‘హేశం అబ్దుల్ వహాబ్’ సంగీతం అందించనున్నాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తన తొలి ప్రొడక్షన్‌గా ఈ సినిమాను నిర్మిస్తుంది.