Dasara Movie: అప్పుడు చిట్టిబాబు.. ఇప్పుడు ధరణి.. సేమ్ టు సేమ్..!
భారీ అంచనాల మధ్య మార్చి 30న రిలీజ్ అయ్యింది దసరా మూవీ. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ సినిమాను చూసిన పలువురు ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాతో కంపేర్ చేస్తున్నారు.

Nani Role In Dasara Movie Similar To Ram Charan Of Rangasthalam
Dasara Movie: నాని, కీర్తి సురేష్‌లు హీరోహీరోయిన్లుగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ మూవీపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతోనే ‘దసరా’ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌కు చేరాయి. ఇక భారీ అంచనాల మధ్య మార్చి 30న రిలీజ్ అయ్యింది దసరా మూవీ. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. నాని ఊరమాస్ రస్టిక్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఈ సినిమాను చూసిన పలువురు ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పక్కా యాక్షన్ ఎమోషనల్ కథగా రాగా, ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చరణ్ విధ్వంసకర పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా రివెంజ్ డ్రామాగా సాగింది. ఇక ఇప్పుడు దసరా మూవీ కూడా యాక్షన్ ఎమోషనల్ కంటెంట్‌తో రాగా, ఈ సినిమాలో ధరణి పాత్రలో నాని రస్టిక్ పర్ఫార్మెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించడం విశేషం.
Dasara Movie: ఓటీటీని లాక్ చేసుకున్న దసరా.. ఎందులో చూడొచ్చు అంటే..?
ఇలా గురుశిష్యులు ఒకే తరహా కథతో వచ్చినా, వేర్వేరు ప్రాంతాల నేటివిటీలో సినిమాలను తెరకెక్కించారు. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రంగస్థలం సినిమాను 2018 మార్చి 30న రిలీజ్ చేయగా, దసరా సినిమా 2023 మార్చి 30న రిలీజ్ అయ్యింది. ఐదేళ్ల గ్యాప్‌లో ఒకే తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అప్పుడు చిట్టిబాబు తన సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగా, ఇప్పుడు ధరణి తన విధ్వంసకర పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాడు. మొత్తానికి చాలా విషయాల్లో చిట్టిబాబు, ధరణి సేమ్ టు సేమ్ అంటూ ఈ విషయాలపై నెటిజన్లు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.