Venkatesh: ప్రైమ్‌లో రానున్న ‘నారప్ప’.. మరి ‘దృశ్యం 2’?

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ తెరుచుకొనేందుకు మార్గం ఏర్పడినా కొత్త సినిమాలు మాత్రం థియేటర్లో వచ్చేందుకు సిద్ధంగా లేవు. మహమ్మారి దెబ్బకి ప్రజలు థియేటర్లో సినిమా చూసేందుకు ఆసక్తి చూపకపోగా ఇతరత్రా కారణాలు కలిసి కొత్త సినిమా థియేటర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధపడడం లేదు.

Venkatesh: ప్రైమ్‌లో రానున్న ‘నారప్ప’.. మరి ‘దృశ్యం 2’?

Venkatesh

Venkatesh: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ తెరుచుకొనేందుకు మార్గం ఏర్పడినా కొత్త సినిమాలు మాత్రం థియేటర్లో వచ్చేందుకు సిద్ధంగా లేవు. మహమ్మారి దెబ్బకి ప్రజలు థియేటర్లో సినిమా చూసేందుకు ఆసక్తి చూపకపోగా ఇతరత్రా కారణాలు కలిసి కొత్త సినిమా థియేటర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధపడడం లేదు. అయితే.. ఇప్పటికే అన్నీ పూర్తిచేసుకొని విడుదలకు సిద్దమైన సినిమాలకు బడ్జెట్ భారం అంతకంతకు పెరుగుతూనే ఉంది. అందుకే మంచి డీల్ కుదిరితే ఓటీటీకి ఇచ్చేసేందుకు మేకర్స్ సిద్దపడుతున్నారు.

ఈక్రమంలోనే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. త్వరలోనే ప్రైమ్ నారప్పను డైరెక్ట్ ఓటీటీకి తీసుకురానుంది. అయితే.. వెంకీ నారప్ప కన్నా ముందే దృశ్యం 2ను పూర్తిచేశాడు. ఎప్పుడో థియేటర్లలో రావాల్సిన ఈ సినిమా సెకండ్ వేవ్ కారణంగా వాయిదాలు పడుతూ వస్తుండగా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత షూటింగ్ బ్యాలెన్స్ పూర్తిచేసుకున్న నారప్ప ముందే ఓటీటీకి ఫిక్స్ అయిపొయింది. దీంతో ఇప్పుడు దృశ్యం 2 విడుదలపై ఆసక్తికర చర్చ మొదలైంది.

చాలాకాలంగా దృశ్యం 2 కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల కానుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే.. ప్రైమ్ నారప్పను తీసుకోగా దృశ్యం 2 ఎవరికి దక్కనుందని ఇండస్ట్రీలో అంచనాలు మొదలయ్యాయి. కాగా, దృశ్యం 2ను ఎక్స్ క్లూజివ్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు తెలుస్తుంది. మళయాళ వెర్షన్ ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ నే తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహించగా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే.. ఓటీటీలో విడుదల.. ఏ సంస్థ దక్కించుకోనుంది అనేదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.