Nayan-Vignesh : నయన్, విగ్నేష్ పెళ్లి.. తమిళనాడు సీఎంకి ప్రత్యేక ఆహ్వానం అందించిన జంట..
నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి జూన్ 9న మహాబలిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. తాజాగా నయనతార, విఘ్నేష్ శివన్‌లు స్వయంగా వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ను.......

Nayan-Vignesh : లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఎప్పట్నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇప్పటికే చెట్టాపట్టాలేసుకొని గుళ్ళు, గోపురాలు, విజిటింగ్ ప్లేసులు తెగ తిరిగేస్తున్నారు. గతంలోనే ఎంగేజిమెంట్ చేసుకున్న ఈ కోలీవుడ్ కపుల్ ఇప్పటికే కలిసి ఉంటున్నట్టు సమాచారం. ఇన్ని రోజులు వారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడి వివాహం డేట్ అనౌన్స్ చేశారు.
నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి జూన్ 9న మహాబలిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరుగనుంది. అలాగే జూన్ 8 సాయంత్రం రిసెప్షన్ కూడా ఉండబోతుందని తమిళ మీడియా నుంచి సమాచారం. తాజాగా నయనతార, విఘ్నేష్ శివన్‌లు స్వయంగా వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ను కలిసి శుభలేఖను అందించి వివాహానికి ఆహ్వానించారు. అలాగే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ను కూడా ఆహ్వానించారు.
Sudigali Sudheer : పెదనాన్న అయిన సుధీర్.. నీ పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు..
దీంతో నయన్, విగ్నేష్ తమిళనాడు సీఎంని కలిసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎంని కూడా పిలిచారంటే వీరి పెళ్లి ఎంత ఘనంగా చేస్తున్నారో ఊహించుకోవచ్చు. ఇక ఈ జంట వివాహానికి తమిళ్, తెలుగు, మలయాళం.. ఇలా సౌత్ సినిమా సెలబ్రిటీలు చాలా మంది హాజరవనున్నట్టు సమాచారం. అయితే వీరి పెళ్లిని నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారం చేయనున్నట్టు, ఇందుకు నెట్ ఫ్లిక్స్ భారీ కాంట్రాక్ట్ చేసుకున్నట్టు, ఈ పెళ్లి ప్రసారానికి డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నట్టు తమిళ మీడియా వర్గాల సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే పెళ్లి రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.