Neha Sshetty : ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా అడిగిన జర్నలిస్ట్.. ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

'డీజే టిల్లు' సినిమా ట్రైలర్ లో హీరో హీరోయిన్ ని ''ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి అని అడగగా హీరోయిన్ 16 అని'' చెప్తుంది. ఈ డైలాగ్ ని ఆధారంగా తీసుకొని ఓ ప్రముఖ జర్నలిస్టు......

Neha Sshetty : ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా అడిగిన జర్నలిస్ట్.. ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Neha Shetty

Neha Sshetty :   సిద్ధు జొన్నలగడ్డ – నేహా శెట్టి జంటగా నటిస్తున్న ”డీజే టిల్లు” సినిమా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయి సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇటీవలే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు. విలేఖరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

 

అయితే ‘డీజే టిల్లు’ సినిమా ట్రైలర్ లో హీరో హీరోయిన్ ని ”ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి అని అడగగా హీరోయిన్ 16 అని” చెప్తుంది. ఈ డైలాగ్ ని ఆధారంగా తీసుకొని ఓ ప్రముఖ జర్నలిస్టు ”హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పించారు కదా.. హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో రియల్ గా తెలుసుకున్నారా?” అని హీరో సిద్ధుని ప్రశ్నించాడు. దీనికి సిద్దు ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పి వదిలేశాడు.

Srivalli Song : పుష్ప , శ్రీవల్లీలని అచ్చు దింపేసిన బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్, హీరోయిన్

దీంతో ఈ ప్రశ్న అడిగిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఆ జర్నలిస్ట్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ నేహాశెట్టి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆ జర్నలిస్ట్ కి కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రశ్న ఉన్న వీడియో క్లిప్ ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ .. ”ఈరోజు ట్రైలర్ లాంచ్ లో ఇలాంటి ప్రశ్న వినాల్సి రావడం చాలా దురదృష్టకరం. కానీ ఈ ప్రశ్న అడిగిన అతని వర్క్ ప్లేస్ లో, ఇంట్లో తన చుట్టూ ఉన్న స్త్రీల పట్ల తనకున్న గౌరవం ఏంటో తెలుస్తుంది. అది మారి తను వారిని గౌరవించాలి” అని పోస్ట్ చేసింది.

Khiladi : డ్యూయల్ రోల్‌లో అనసూయ.. రవితేజకి అత్తగా??

హీరోయిన్ నేహాకి సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. ఆ జర్నలిస్ట్ ని ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘డీజే టిల్లు’ నిర్మాత నాగవంశీ కూడా నేహా ట్వీట్ పై స్పందిస్తూ “సారీ నేహా.. ఇది నిజంగా దురదృష్టకరం” అని పోస్ట్ చేశారు. అయితే దీనిపై ఆ జర్నలిస్ట్ స్పందిస్తూ.. ”నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని, మిమ్మల్ని అగౌరవపరచాలని అనుకోలేదు. దీనికి నేను క్షమాపణలు తెలియచేస్తున్నాను” అంటూ ఆ హీరోయిన్ ని ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు.