Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి.....

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!

Nithiin Macherla Niyojakavargam Latest Update

Nithiin: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తి పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో చిల్ అవుతోన్న నితిన్

కాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా, మొత్తం పూర్తయ్యినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో నితిన్ సరికొత్త పాత్రతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇక ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాలోని బ్యాలెన్స్ సాంగ్ షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో చార్జ్ తీసుకున్న సిద్ధార్థ్ రెడ్డి

ఈ చిత్రంలో నితిన్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, మరో బ్యూటీ కేథరిన్ త్రేజా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో తెలియాలంటే ఆగస్టు 12 వరకు వెయిట్ చేయాల్సిందే.