Nithin : కాలికి గాయం.. రోజూ ఫిజియోథెరపీ చేయిస్తూ డ్యాన్స్ చేశాను.. మాచర్ల కోసం నితిన్ కష్టం..

ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ.. ''సినిమా షూటింగ్ సమయంలో నా కాలికి గాయమైంది మోకాలి దగ్గర. చిన్నదే కదా అని ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని ఫారిన్ లో సాంగ్ షూట్ కి.............

Nithin : కాలికి గాయం.. రోజూ ఫిజియోథెరపీ చేయిస్తూ డ్యాన్స్ చేశాను.. మాచర్ల కోసం నితిన్ కష్టం..

nitthin macharla niyojakavargam

Nithin :  ఆగస్టు 12న మాచర్ల నియోజకవర్గం సినిమాతో రాబోతున్నాడు నితిన్. కృతిశెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మించాడు నితిన్. దీంతో ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసుకునే తన అక్కతో కలిసి రాఖీ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు నితిన్. సింగర్ మంగ్లీ ఈ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు అక్కా తమ్ముళ్లు.

Nithin : ఐఏఎస్ ఐపీఎస్ అవుదామనుకున్నాను.. కానీ ఇలా.. అక్కతో కలిసి అల్లరి చేసిన నితిన్

ఈ ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ.. ”సినిమా షూటింగ్ సమయంలో నా కాలికి గాయమైంది మోకాలి దగ్గర. చిన్నదే కదా అని ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని ఫారిన్ లో సాంగ్ షూట్ కి వెళ్ళిపోయాను. కానీ అక్కడిసికి వెళ్ళాక అది ఇంకా ఎక్కువైంది. డ్యాన్స్ చేయలేకపోయాను. మళ్ళీ ఇండియా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని షూటింగ్ మొదలు పెట్టాము. అది పూర్తిగా తగ్గాలి అంటే నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కానీ షూటింగ్ లేట్ అయిపోతుందని సపరేట్ గా ఫిజియోథెరపీ చేసే వాళ్ళని పిలిపించుకొని నెల రోజుల పాటు డైలీ ఉదయం, సాయంత్రం ఫిజియోథెరపీ చేస్తూ డ్యాన్సులు చేశాను. ఒక్కోసారి డ్యాన్స్ చేస్తూ నొప్పి వస్తే మధ్యలో ఆపి ఫిజియో చేయించుకొని మళ్ళీ డ్యాన్స్ వేసేవాడిని” అని తెలిపాడు.

ఇలా మాచర్ల నియోజకవర్గం సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో తెలిపాడు నితిన్. రాఖి రోజు ఇలా అక్కతో కలిసి నితిన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వైరల్ గా మారింది.