Nithin : ఐఏఎస్ ఐపీఎస్ అవుదామనుకున్నాను.. కానీ ఇలా.. అక్కతో కలిసి అల్లరి చేసిన నితిన్

ఈ ఇంటర్వ్యూలో.. నితిన్ తన ఫేవరేట్ హీరోయిన్ గురించి చెప్తూ ఖుషి టైంలో భూమిక అంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో ఎవ్వరూ లేరు అని...........

Nithin : ఐఏఎస్ ఐపీఎస్ అవుదామనుకున్నాను.. కానీ ఇలా.. అక్కతో కలిసి అల్లరి చేసిన నితిన్

Nithin Special Interview with his sister

Nithin :  లవర్ బాయ్ నితిన్ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ మాస్ హీరోగా మారడానికి ట్రై చేస్తున్నాడు. ఈ ఆగస్టు 12న మాచర్ల నియోజకవర్గం సినిమాతో రాబోతున్నాడు. కృతిశెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మించాడు నితిన్. దీంతో ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసుకునే తన అక్కతో కలిసి రాఖీ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు నితిన్. సింగర్ మంగ్లీ ఈ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు అక్కా తమ్ముళ్లు.

ఈ ఇంటర్వ్యూలో.. నితిన్ తన ఫేవరేట్ హీరోయిన్ గురించి చెప్తూ ఖుషి టైంలో భూమిక అంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ లో ఎవ్వరూ లేరు అని చెప్పారు. చిన్నప్పట్నుంచి అక్క తమ్ముళ్లు ఇద్దరూ చదువులో యావరేజ్ అని, జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకునేవాళ్లమని తెలిపారు. చిన్నప్పట్నుంచి ఐఏఎస్, ఐపీఎస్.. ఇలా పెద్ద పెద్దవి అవుదామనుకున్నాను కానీ ఇలా హీరో అయ్యాను. అందుకే ఇప్పుడు నేను చిన్నప్పుడు అవ్వాలనుకున్నవన్నీ నా సినిమాలలో క్యారెక్టర్స్ వేస్తూ సంతోషిస్తున్నాను అని తెలిపాడు నితిన్.

Vijay Devarakonda : నాకు టైం లేదు.. అందుకే చెప్పులు వేసుకుంటున్నాను..

నితిన్ సిస్టర్ నిఖితా రెడ్డి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు నితిన్ ని బాగా చూసుకున్నారు. వీడి మీదే ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు చిన్నవాడని, నితిన్ చేసిన సినిమాల్లో సై, ఇష్క్, భీష్మ సినిమాలు చాలా ఇష్టం. నితిన్ ఒక్కోసారి కథలు నన్ను వినమంటాడు, విని నా ఒపీనియన్ చెప్తాను అని తెలిపింది. ప్రతి రాఖీకి ఎక్కడున్నా వచ్చి నా దగ్గర రాఖీ కట్టించుకుంటాడు. నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు అని తెలిపింది.

ఈ ఇంటర్వ్యూలో నితిన్, మంగ్లీ కలిసి రాను రాను అంటూనే చిన్నదో సాంగ్ పాడారు. అలాగే చివర్లో నితిన్ కి వాళ్ళ సిస్టర్, మంగ్లీ ఇద్దరూ రాఖీ కట్టారు. రాఖి రోజు ఇలా అక్కతో కలిసి నితిన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వైరల్ గా మారింది.