OTT Release: ఒరిజినల్స్‌కు ఊపిరాడకుండా చేస్తున్న వెబ్ సిరీస్‌లు!

ఇప్పుడు ఓటీటీల్లో అన్ని వర్తిస్తాయి. అటు బిగ్ స్క్రీన్ ను డామినేట్ చేయాలి.. ఇటు స్మాల్ స్క్రీన్ లో పోటీని తట్టుకోవాలి. అందుకే ఓటీటీల్లో కూడా రిలీజ్ క్లాషెస్, రియాలిటీ షోకేజ్ లతో..

OTT Release: ఒరిజినల్స్‌కు ఊపిరాడకుండా చేస్తున్న వెబ్ సిరీస్‌లు!

Ott Release

OTT Release: ఇప్పుడు ఓటీటీల్లో అన్ని వర్తిస్తాయి. అటు బిగ్ స్క్రీన్ ను డామినేట్ చేయాలి.. ఇటు స్మాల్ స్క్రీన్ లో పోటీని తట్టుకోవాలి. అందుకే ఓటీటీల్లో కూడా రిలీజ్ క్లాషెస్, రియాలిటీ షోకేజ్ లతో పాటూ డబ్బింగ్ వెబ్ సిరీస్ల జోరు పెరిగింది. ఒరిజనల్ లాంగ్వెజ్ వర్షన్స్ ను ఇవి ఊపిరాడకుండా చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్స్ లో కనిపించే డబ్బింగ్ హడావుడీ.. ఇప్పుడు ఓటీటీని ముంచెత్తింది.

Radhe Shyam: పూజ పాత్రకి విషాదాంతం.. అప్డేట్స్ ఏం చెప్తున్నాయ్?

ఇన్నాళ్లు సినిమాలు, సీరియళ్ల విషయంలో కనిపించిన డబ్బింగ్ దూకుడు.. ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్ లో విజృంభిస్తుంది. లాంగ్వేజ్ విషయంలో పరిధులు కూడా ఏం లేవు కాబట్టి.. ఏ భాషలో సక్సెస్ చూసినా వెబ్ సిరీస్ అయినా వెంటనే అన్ని భాషల్లోకి అనువాదమవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి బిగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి రీజనల్ సంస్థల వరకు డబ్బింగ్‌ సిరీస్‌ లకు పెద్ద పీట వేస్తున్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసిన వెబ్‌సిరీస్‌ లు ప్రాంతీయ భాషల్లోకి డబ్‌ చేస్తే కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

Ajith Kumar: నయా ట్రెండ్.. తోకలొద్దు.. నా పేరే నాకు ముద్దు!

ఒరిజినల్‌ సీరీస్‌ నిర్మించాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. అదే హిట్ సిరీస్ ను డబ్ చేస్తే ఈజీగా సూపర్ కంటెంట్ వచ్చేస్తోంది. సబ్ స్క్రైబర్స్ ను ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ఎంగేజ్ చేయాలంటే ఈ గాలం వేయక తప్పట్లేదు. అదేం ఊరికే కాదు కదా.. కాసింత పెట్టుబడికి ఊహించనంత రాబడి వస్తుంది. నిజానికి ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ సిరీస్‌ తో ఇండియాలో వెబ్‌సిరీస్‌ ల క్రేజ్‌ పెరిగింది. తర్వాత ‘మనీ హైస్ట్‌’ లాంటివి వెబ్‌సిరీస్‌ కల్చర్‌ ను ఇక్కడి ఆడియెన్స్ కు అలవాటు చేసాయి. త్వరలో రాబోయే మనీ హైస్ట్ పార్ట్ 5 వ్యాల్యూమ్ 2 కోసం మనవారి ఎదురుచూపులు చూస్తుంటే.. జోరెలావుందో అర్ధమవుతుంది.

Salman Khan: సల్లూ భాయ్‌ని వాడేసుకుంటున్న తెలుగు హీరోలు!

కేవలం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ లో తెరకెక్కిన కొన్ని హిందీ వెబ్ సిరీస్ లకి సైతం సౌత్ లో మంచి మార్కెట్ ఉంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘మీర్జాపూర్‌’, ‘పాతాళ్‌ లోక్‌’, ‘స్కామ్‌ 1992’ లాంటి సిరీస్ లను ఇక్కడి వారు బాగానే ఆదరించారు. స్టార్టింగ్ లో ఇవి ఇంగ్లీష్‌, హిందీ లాంగ్వేజెస్ లోనే రిలీజైనా.. అన్ని భాషల వారిని అట్రాక్ట్ చేసే దిశగా.. సబ్ స్క్రైబర్స్ ను పెంచుకునే పనిలో వెబ్‌ సిరీస్‌ లను తెలుగులో డబ్‌ చేసి స్ట్రీమింగ్ చేసారు. సో ఒక్కటి హిట్ అనిపించుకుంటే చాలు వరుసగా క్యూ కడతాయి కాబట్టి.. ఇప్పుడదే జరుగుతుంది ఓటీటీల్లో.

Akhanda: బాలయ్య మాస్ జాతర.. హ్యాట్రిక్ సక్సెస్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

అమెజాన్ ప్రైమ్ లో కొన్ని హిందీ వెబ్ సిరీస్ లు నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాయి. సెన్సార్ ఉంటే ఏ సర్టిఫికేట్ ను మించి ఏదైనా ఇచ్చుండేవారేమో అనిపించే మీర్జాపూర్ సిరీస్ కు తెలుగు ఆడియెన్స్ కనెక్టయ్యారు. ఫస్ట్ సీజన్ ను ఓ రేంజ్ లో హిట్ చేసి పడేసిన ఇక్కడి ఆడియెన్స్.. సెకండ్ సీజన్ తెలుగు వర్షన్ కాస్త లేట్ అయితే సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఈ సిరీస్ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘ద ఫర్‌ గాటెన్‌ ఆర్మీ’, తెలుగు మేకర్స్ రాజ్ అండ్ డీకే తీసుకొచ్చిన ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ సూపర్ డూపర్ టాక్ తెచ్చుకున్నాయి. వీటికి ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యాన్స్ గా మారడంతో తిరుగులేకుండా పోయింది.

Sonakshi Sinha: మతులు పోగొడుతున్న బొద్దుగుమ్మ సోనాక్షి

అమెజాన్‌ ప్రైమ్‌ నుంచే వచ్చిన ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’, మాధవన్‌ లీడ్‌రోల్‌ చేసిన ‘బ్రీత్‌’, ఇంగ్లీష్‌ వెబ్‌ సీరీస్‌ ‘జాక్‌ ర్యాన్‌’, సూపర్‌ హీరోస్‌ టీవీ షో ‘ద బాయ్స్‌’, ‘డామ్‌’, బ్రెజిలియన్‌ వెబ్‌సిరీస్‌ ‘ద లాస్ట్‌ హవర్‌’ లాంటి పలు పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ లను తెలుగులో డబ్‌ చేసి హిట్ కొట్టింది ప్రైమ్‌. జీ5 కూడా తమిళ్ వెబ్‌సిరీస్‌ ‘ఫింగర్‌ టిప్‌’ తో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసింది. అలాగే ‘కాఫిర్‌’, ‘కోడ్‌ ఎం’, స్పానిష్‌ సిరీస్‌ ‘పాబ్లో ఎస్కోబార్‌’ వంటివి సూపర్ సక్సెసయ్యాయి జీ5 లో.

RRR: జనవరి 7 విడుదల.. బాహుబలి కోటను బద్దలు కొట్టగలరా?

స్క్విడ్ గేమ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ ఏ రేంజ్ సునామీ సృష్టిస్తుందో చూస్తున్నాం. ఇంగ్లీషు, హిందీలో మాత్రమే ఫస్ట్ స్ట్రీమింగ్ ఆప్షన్స్ ఇచ్చింది నెట్ ఫ్లిక్స్. ఈ తర్వాత నేషనల్ వైడ్ పెరిగిన డిమాండ్ తో రీజనల్ లాంగ్వేజెస్ లో ప్రెజెంట్ చేస్తోంది. స్క్విడ్ గేమ్ తర్వాత అంతటి సక్సెస్ చూసింది మనీ హైస్ట్. బ్రిటిష్‌ వెబ్‌సిరీస్‌ ‘బి హైండ్‌ హర్‌ ఐస్‌’ కూడా పర్వాలేదనిపించినా మనీ హైస్ట్ సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. దీని కోసం రంగంలోకి సెలెబ్రిటీలను రంగంలోకి దింపిన నెట్ ఫ్లిక్స్…పార్ట్ 5 వ్యాల్యూమ్ 2తో గట్టి దెబ్బ కొట్టాలనే చూస్తోంది. అలాగే నేషనల్ కంటెంట్ పై దృష్టిపెట్టిన నెట్ ఫ్లిక్స్ డిల్లీ క్రైమ్, బాంబే బేగమ్స్, పావ కదైగల్ వంటి వాటిని చూపించి.. త్వరలోనే అరణ్యక్ ను దింపుకోంది.

Shraddha Das: శ్రద్ధగా ఆరబోయాలంటే శ్రద్ధా తర్వాతే ఎవరైనా!

ఓటీటీల్లో లాస్ట్ ప్లేస్ లో ఉన్న సోనీ లివ్‌ ను ఒక్కసారిగా పైకి లేపిన సిరీస్ ‘స్కామ్‌ 1992’. ప్రతీక్‌గాంధీ బ్రిలియంట్ పర్మాఫెన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ ఐఎండీబీ రికార్డులను బ్రేక్‌ చేసింది. సోనీలివ్ లోనే ‘మహారాణి’ సిరీస్‌ తెలుగు డబ్బింగ్ వర్షన్ మంచి ఆదరణ దక్కించుకుంది. హాట్‌స్టార్‌లో ‘క్రిమినల్‌ జస్టిస్‌’ సీరీస్, బాలీవుడ్‌ డైరెక్టర్ నీరజ్‌ పాండే డైరెక్ట్ చేసిన ‘స్పెషల్‌ ఆప్స్‌’ తెలుగులో కూడా సక్సెసయ్యాయి. ‘ఆర్య’ వెబ్‌ సిరీస్‌ను ఆరు భాషల్లో విడుదల చేసిన టీమ్ త్వరలోనే ఆర్య2ని రంగంలోకి దింపుతోంది.