Anoushey Ashraf : పాకిస్థాన్ బాలీవుడ్ ని విమర్శించినా.. నాకు మాత్రం షారుఖ్ యూనివర్సల్ సూపర్ స్టార్.. పాకిస్థాన్ నటి పోస్ట్..

విదేశాల్లో ఉన్న పలువురు నటులు, అభిమానులు కూడా షారుఖ్, పఠాన్ లని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నటి అనౌషే అష్రాఫ్ షారుఖ్ ఖాన్ పై చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. పఠాన్ సినిమా చూసిన అనంతరం అనౌషే అష్రాఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో......................

Anoushey Ashraf : పాకిస్థాన్ బాలీవుడ్ ని విమర్శించినా.. నాకు మాత్రం షారుఖ్ యూనివర్సల్ సూపర్ స్టార్.. పాకిస్థాన్ నటి పోస్ట్..

Pakistan actress Anoushey Ashraf comments on Shahrukh Khan goes viral

Anoushey Ashraf :  షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న రిలీజయి మంచి విజయం సాధించింది. షారుఖ్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యాక్షన్ సినిమాతో థియేటర్స్ లోకి రావడంతో అభిమానులు, ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది. పఠాన్ సినిమా నాలుగు రోజుల్లోనే 429 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులని క్రియేట్ చేసింది. ఇక షారుఖ్ కి విదేశాల్లో కూడా భారీగా అభిమానులున్నారు. ముఖ్యంగా దుబాయ్, గల్ఫ్, పాకిస్థాన్ లాంటి దేశాల్లో షారుఖ్ కి అభిమానులు చాలామంది ఉన్నారు. అందుకే పఠాన్ సినిమా ఆ దేశాల్లో కూడా మంచి విజయం సాధించి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.

విదేశాల్లో ఉన్న పలువురు నటులు, అభిమానులు కూడా షారుఖ్, పఠాన్ లని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నటి అనౌషే అష్రాఫ్ షారుఖ్ ఖాన్ పై చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. పఠాన్ సినిమా చూసిన అనంతరం అనౌషే అష్రాఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ప్రజలు అతన్ని అంతగా ఇష్టపడకపోవచ్చు, మనం పాకిస్థానీలు బాలీవుడ్‌ను ప్రోత్సహించకూడదని భావిస్తున్నాము. కానీ నాకు మాత్రం షారుఖ్ ఖాన్ యూనివర్సల్ సూపర్‌స్టార్. కళాకారులుగా మేము సరిహద్దులు దాటి వ్యక్తులతో కనెక్ట్ అవుతామని నమ్ముతున్నాను. ప్రపంచానికి మనం కేవలం మనుషులుగా మాత్రమే తెలుసు కానీ షారుఖ్ మాత్రం చాలా స్పెషల్. నేను ఎప్పటికీ షారూఖ్ ఖాన్ కు అభిమానినే అని పోస్ట్ చేసింది.

Shahrukh Khan : పఠాన్ సక్సెస్ తర్వాత ఫ్యాన్స్‌కి అభివాదం చేసిన షారుఖ్.. జనసంద్రమైన మన్నత్ రోడ్..

దీంతో అనౌషే అష్రాఫ్ చేసిన ఈ పోస్ట్ పాకిస్థాన్ లో వైరల్ గా మారగా పలువురు ఆమెని విమర్శిస్తున్నారు. ఇండియాలో నటించడానికి, షారుఖ్ కంట్లో పడటానికే ఈమె ఇలా పోస్టు చేసింది అంటూ పలువురు పాకిస్థాన్ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై కూడా అనౌషే అష్రాఫ్ సమాధానమిస్తూ.. నా వ్యక్తిగత అభిప్రాయాలని నా సోషల్ మీడియాలో పంచుకుంటాను అని కౌంటర్ వేసింది.