Parasuram: స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి పరుశురామ్.. నెక్స్ట్ ఏంటి?

టాలీవుడ్ లో స్మూత్ లవ్ స్టోరీస్ బాగా హాండిల్ చేయగలడని ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ పరుశురామ్.. ఇప్పటివరకు మీడియం రేంజ్ సినిమాలకే పరిమితమయ్యారు..

Parasuram: స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి పరుశురామ్.. నెక్స్ట్ ఏంటి?

Parasuram

Parasuram: టాలీవుడ్ లో స్మూత్ లవ్ స్టోరీస్ బాగా హాండిల్ చేయగలడని ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ పరుశురామ్.. ఇప్పటివరకు మీడియం రేంజ్ సినిమాలకే పరిమితమయ్యారు.. లేటెస్ట్ గా తన అభిమాన హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేసి, స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. సర్కార్ వారి పాట రిలీజ్ అయిపోయింది. పరుశురామ్ నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? ఏ స్టార్ తో చేయబోతున్నారు?

Parasuram Petla: మాస్‌లో క్లాస్ పరుశురాం.. ఎస్‌వీపీ మరో మెట్టు ఎక్కిస్తుందా?

ఇప్పటి వరకూ యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీతాగోవిందం లాంటి మీడియం రేంజ్ హీరోల తో సినిమాలు చేసిన పరుశురామ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కార్ వారి పాట చేసి, ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.. సర్కార్ వారి పాట రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, ఏ స్టార్ తో సినిమా ఉంటుంది అంటూ ఫిలిం సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మధ్య ఓ ఇంటర్యూలో నాగచైతన్యతోనే తన నెక్స్ట్ మూవీ ఉటుందని కన్ఫామ్ చేశాడు పరుశురామ్.

Parasuram : నాకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి అని మెసేజ్ పెట్టారు మహేష్

నాగచైతన్య విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ మూవీ ఫినిష్ చేశాడు. లేటెస్ట్ గా దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.. తర్వాత చైతూతో సినిమా చేయడానికి లైన్ లో కిషోర్ తిరుమల, నందిని రెడ్డి, వంకట్ ప్రభు ఉన్నారు. ఇప్పటి వరకూ చైతూ ఏ డైరెక్టర్ తో, సినిమాను ఓకె చేయలేదు. పరుశురామ్ తో సినిమా చేస్తాడా లేదా 2022 ఫిబ్రవరిలోనే గీతా ఆర్ట్స్ ప్రపోజలంటూ ఓ న్యూస్ వైరలయ్యింది. పరుశురామ్ సర్కార్ వారి పాట హిట్ అయితే, గీతాగోవిందం మ్యాజిక్ నే రిపీట్ చేస్తూ, పరుశురామ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా గీతాఆర్ట్స్ నిర్మించనుందని వార్తలొచ్చాయి.

Parasuram: మహేశ్ దర్శకుడి భారీ స్కెచ్.. ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్!

అయితే సర్కార్ వారి పాట డివైడ్ టాక్ తో థియేట్రికల్ రన్ కొనసాగుతుంది. ఎన్టీఆర్ లైనప్ లో ఆల్రెడీ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, శంకర్ లాంటి డైరెక్ఱర్స్ ఉన్నారు. సో పరుశురామ్ తో ఇప్పుడప్పుడే సినిమా చేసే ఛాన్స్ లేదు. అంటే చైతూతోనే పరుశురామ్ సినిమా చేసే ఛాన్సెస్ ఎక్కువ గా ఉన్నాయి. ఎందుకంటే సర్కార్ వారి పాటకన్నా ముందే చైతూతో ఓ సబ్జెక్ట్ ఓకే చేపించుకున్నాడు పరుశురామ్.. స్టార్ డైరెక్టర్ అయినా కూడా అదే కమిట్మెంట్ తో ఉన్నాడు. అంటే నెక్స్ట్ పరుశురామ్ చేయబోయే సినిమా చైతూతోనే అని చర్చించుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.