Parineeti Chopra : నాతో వచ్చి సముద్రాన్ని క్లీన్‌ చేయండి.. | parineeti chopra cleaning ocean

Parineeti Chopra : నాతో వచ్చి సముద్రాన్ని క్లీన్‌ చేయండి..

తాజాగా బాలీవుడ్‌ భామ పరిణీతి చోప్రా సముద్రాన్ని క్లీన్ చేద్దాం రండి అంటూ తాను క్లీన్ చేసి చూపించి వేరేవాళ్లని మోటివేట్ చేస్తుంది. స్కూబా డైవింగ్‌ అంటే ఇష్టమున్న పరిణీతి చోప్రా ఇటీవల............

Parineeti Chopra : నాతో వచ్చి సముద్రాన్ని క్లీన్‌ చేయండి..

Parineeti Chopra :  అప్పుడప్పుడు మన సెలబ్రిటీలు కొన్ని మంచి పనుల్లో కూడా పాల్గొంటారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించమని ఎంత చెప్తున్నా ప్రజల్లో మార్పు రావట్లేదు. ప్లాస్టిక్ తో పాటు పలు వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వెళ్తున్నాయి. దీంతో సముద్రంలో నివసించే జీవులకి హాని కలగడమే కాక సముద్రాలూ కూడా కలుషితం అవుతున్నాయి. దీనిపై ఎప్పట్నుంచో ఉద్యమం నడుస్తుంది.

తాజాగా బాలీవుడ్‌ భామ పరిణీతి చోప్రా సముద్రాన్ని క్లీన్ చేద్దాం రండి అంటూ తాను క్లీన్ చేసి చూపించి వేరేవాళ్లని మోటివేట్ చేస్తుంది. స్కూబా డైవింగ్‌ అంటే ఇష్టమున్న పరిణీతి చోప్రా ఇటీవల సముద్రంలో డైవింగ్ చేస్తూ ఓ మంచి పని చేసింది. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ అందులోని చెత్తను సేకరించింది. ఈ చెత్తను సేకరించడాన్ని వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చెత్తలో ప్లాస్టిక్ కవర్లు, మాస్కులు, పనికిరాని డబ్బాలు.. ఇలా చాలానే ఉన్నాయి.

Karan Johar : కాఫీ విత్ కరణ్.. వచ్చేస్తుంది.

 

పరిణితి చోప్రా ఈ వీడియోని షేర్ చేసి.. ”సరదాగా డైవింగ్ చేశాను. అలాగే చెత్తను సేకరించడం వల్ల ఓ మంచి పని చేయగలిగా. సముద్రాన్ని క్లీన్‌ చేయడానికి నాతో చేరండి” అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కాగా మంచిపని చేస్తున్నావు అంటూ పరిణీతి చోప్రాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

×