Pawan Kalyan : యువ క్రికెటర్‌కు పవన్ ఆర్ధిక సహాయం..

తాజాగా పవన్ మరో సహాయం చేశారు. పవన్ చేసిన ఈ సాయం ఎవరికీ చెప్పుకోలేదు. అభిమానుల ద్వారా, పార్టీ కార్యకర్తల ద్వారా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది భారత......

Pawan Kalyan : యువ క్రికెటర్‌కు పవన్ ఆర్ధిక సహాయం..

Pawan

Pawan Kalyan :  టాలీవుడ్ స్టార్స్ అనేక సందర్భాలలో చాలా మందికి సహాయాలు చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా వారు సహాయం అందచేస్తారు. ఇందులో పవన్ కళ్యాణ్ ముందు వరసలో ఉంటారు. పవన్ కళ్యాణ్ ఆఫ్ స్క్రీన్ లో అనేక మందికి ఎంతో సాయం చేస్తారనే సంగతి తెలిసిందే. ఆ సహాయాల్లో కొన్ని బయటకి వస్తాయి. కొన్ని బయటకి రావు. అధికారికంగా చేసే సహాయాలు కొన్ని అయితే అన్ అఫీషియల్ గా కూడా ఎన్నో సహాయాలు చేస్తారు. ముఖ్యంగా ప్రతిభ ఉన్న యువతకి పవన్ ఎప్పుడూ సహకారం అందిస్తారు. గతంలో కూడా చాలా మంది ట్యాలెంటెడ్ యువతకి పవన్ చేయూతనిచ్చారు.

Rajamouli : ఏపీ సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ రాజమౌళి ట్వీట్..

తాజాగా పవన్ మరో సహాయం చేశారు. పవన్ చేసిన ఈ సాయం ఎవరికీ చెప్పుకోలేదు. అభిమానుల ద్వారా, పార్టీ కార్యకర్తల ద్వారా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది భారత అండర్ 19 క్రికెట్ కప్ లో వైస్ కెప్టెన్ గా మరియు బ్యాట్స్ మెన్ గా సత్తా చాటిన తెలుగు యువకుడు షేక్ రషీద్ కి పవన్ ఆర్ధికంగా సహాయం చేశారు. గుంటూరుకి చెందిన ఈ యువ క్రికెటర్ గురించి తెలుసుకున్న పవన్ ఇతనికి తన ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ట్రస్ట్ నుంచి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు. దీనిని జనసేన పార్టీ నేతలు రషీద్ నివాసానికి వెళ్లి అందించినట్టు తెలుస్తుంది. త్వరలోనే రషీద్ పవన్ ని కలవొచ్చని కూడా తెలుస్తుంది. దీంతో పవన్ అభిమానులు, నెటిజన్లు మరోసారి పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.