Bheemla Nayak: లాలా భీమ్లా.. జనవరిలో లేనట్లేనా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని ‘భీమ్లా నాయక్’ పేరుతో..

10TV Telugu News

Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని ‘భీమ్లా నాయక్’ పేరుతో దర్శకుడు చంద్ర సాగర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. జనవరి 12న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించేయగా సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

RRR: ఒకేరోజు 4 చోట్ల ట్రైలర్ లాంచ్.. యూనిట్ కోసం స్పెషల్ ఫ్లైట్!

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు సూపర్ డూపర్ అప్లోజ్ తీసుకురాగా మెగా అభిమానాలు వెయ్యి కళ్ళతో ఈ సినిమా కోసం వేచిఉన్నారు. అయితే.. భీమ్లా నాయక్ దాదాపుగా పండగ వార్ నుండి తప్పుకోనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. ముందునుండి సినిమాను సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న రిలీజ్ చేస్తామని చెప్తున్నప్పటికీ.. పరిస్థితులు మారుతుండడంతో ‘భీమ్లా నాయక్’ విడుదల వాయిదా తప్పదనే వార్తలు వస్తున్నాయి.

Akhanda: అఖండ మాస్ జాతర.. ఐదవ రోజూ కాసుల వర్షం!

ఒకవైపు ఆర్ఆర్ఆర్.. మరోవైపు రాధేశ్యామ్ పండగ సీజన్ ను నేషనల్ వైడ్ కబ్జా చేసేయగా.. మధ్య తమిళంలో నుండి అజిత్ లాంటి హీరోలు కూడా పండగ బరిలో ఉండేందుకు సిద్ధపడ్డారు. దీంతో భీమ్లా నాయక్ మేకర్స్ మరోసారి ఆలోచన చేసి వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. మధ్య మధ్యలో ఇలా వాయిదా కథనాలు వచ్చినా మేకర్స్ మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లో ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికే వస్తాడని కన్ఫర్మేషన్ చేస్తూ వచ్చారు. మరి ఈసారి కూడా అదేవిధంగా సంక్రాంతికే భీమ్లా వచ్చేస్తాడని చెప్తారా లేక వాయిదా కన్ఫర్మ్ చేస్తారా చూడాలి మరి.

×