Penalty for Actress: టీవీ నటికి రూ. 330కోట్ల జరిమానా!

పన్ను ఎగవేత ఆరోపణలపై చైనా నటి జెంగ్ షువాంగ్‌కు 46 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.330కోట్లు) జరిమానా విధించింది చైనా ప్రభుత్వం.

Penalty for Actress: టీవీ నటికి రూ. 330కోట్ల జరిమానా!

Nati

పన్ను ఎగవేత ఆరోపణలపై చైనా నటి జెంగ్ షువాంగ్‌కు 46 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.330కోట్లు) జరిమానా విధించింది చైనా ప్రభుత్వం. చైనీస్ మీడియా అవుట్లెట్ గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఇప్పటివరకు నటి నటించిన షోలు కూడా ఇకపై ప్రసారం చేయరు. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించే డ్రాగన్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా అంటే, ఏప్రిల్ నుంచి దర్యాప్తు చేస్తున్నారు

షాంఘై టాక్స్ అథారిటీ ఏప్రిల్ నుంచి జరుపుతున్న విచారణలో ఈమేరకు భారీ మోసాలు బయటపడ్డాయి. పన్నులు భారీగా ఎగగొట్టినట్లు తేలగా.. ఆమెకు పెద్దమొత్తంలోనే ఫైన్ వేశారు. జెంగ్ షువాంగ్‌ 2019లో టెలివిజన్ సిరీస్‌లో ఆమె పాత్ర కోసం 24మిలియన్‌ డాలర్లు తీసుకున్నారు. అయితే ఇందులో ఆమె 7.4 డాలర్లను మాత్రమే అధికారికంగా ప్రకటించారు. మాజీ భర్త జెంగ్ హెంగ్ సమాచారం మేరకు మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మొత్తంగా జెంగ్ 2019 నుంచి 2020 వరకు 29.45మిలియన్‌ డాలర్లను బ్లాక్‌ మనీగా పోగుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 7మిలియన్‌ డాలర్ల పన్నులను ప్రభుత్వానికి ఎగగొట్టినట్లు నిర్ధారించారు. దీంతో ఆమెపై ఏకంగా 3వందల 30కోట్లకు పైగా జరిమానా విధించారు అధికారులు.

జెంగ్‌ను మరో నటి ఫాన్‌బింగ్‌బింగ్‌తో పోల్చారు అధికారులు. ఫాన్‌బింగ్‌బింగ్‌ కూడా పన్నులు చెల్లించకపోవడంతో గతంలో ఆమె కంపెనీలపై 958కోట్ల భారీ జరిమానా విధించారు. ఆమెపై వ్యక్తిగతంగా సుమారు రూ. 515 కోట్ల జరిమానా వేశారు. సుదీర్ఘ కాలంగా పన్ను చెల్లించని కేసులో వ్యక్తిగత విచారణకు హాజరుకాకపోవడంతో ఆదాయపన్ను అధికారులు ఫాన్‌కు ఈ భారీ జరిమానా విధించారు. ఇప్పుడు వీరిద్దరి పేర్లు చైనాలో మారు మ్రోగుతున్నాయి.