పోలీసుల క్రియేటివిటీ కేక.. పవన్ కళ్యాణ్, నానీ ఫోటోలతో మెమీస్..

పోలీసుల క్రియేటివిటీ కేక.. పవన్ కళ్యాణ్, నానీ ఫోటోలతో మెమీస్..

Police Creativity Memes With Photos Of Pawan Kalyan And Nani

సోషల్ మీడియాలో పోలీసోళ్ల సెటైర్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇటీవలికాలంలో మెమీస్‌తో సరదాగా నవ్విస్తూనే.. ట్రాఫిక్ విషయంలో నేరాల విషయంలో అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సైబ‌రాబాద్ పోలీసులు వేసిన మెమీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో మెమీస్‌తో ఇంట్రస్టింగ్‌గా విషయాలను చెప్పడం ట్రెండ్ అవుతోండగా.. సోష‌ల్ మీడియాలో ట్రాఫిక్ రూల్స్‌పై ప్ర‌చారం చేసేందుకు పోలీసులు కూడా మీమ్స్ ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ రూల్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ సైబ‌రాబాద్ పోలీసులు సినీ రూట్‌లో వేసిన ఓ మెమీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాలో తండ్రికొడుకులకు మధ్య జరిగే సంబాషణకు సంబంధించి స‌రికొత్త మీమ్‌ను సృష్టించి సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. రెండురోజుల క్రితం ఈ సినిమాకు జాతీయ అవార్డు రాగా.. హెల్మెట్ గురించి ప్రస్తావిస్తూ.. ‘నాన్న నువ్వు హెల్మెట్‌ పెట్టుకుంటే బాగుంటావ్‌ నాన్న ‘ అనే డైలాగ్‌కు అద‌నంగా ‘బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో’ అనే సెటైర్ వేశారు.. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


అంతకుముందు ‘చావు కబురు చల్లగా’ సినిమాకు సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘హెల్మెట్‌ పెట్టుకోండి బాలరాజు గారు.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం ఉండదు’ అంటూ సైబరాబాద్‌ పోలీసులు క్రియేట్ చేసిన స‌ర‌దా పోస్ట్ కూడా సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయింది.


పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో ప్రకాష్ రాజ్‌తో సన్నివేశానికి సంబంధించిన మెమీ కూడా ఆకట్టుకుంటుంది.