Pooja Hegde: పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరని అడిగితే ఠక్కున పూజా హెగ్డే అనే పేరు ముందుగా వినిపిస్తుంది. అమ్మడు ఏ సినిమా చేసినా హిట్టు.. కాదు సూపర్ హిట్టు...

Pooja Hegde: పూజాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా..?

Pooja Hegde Bad Time Started

Pooja Hegde: టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరని అడిగితే ఠక్కున పూజా హెగ్డే అనే పేరు ముందుగా వినిపిస్తుంది. అమ్మడు ఏ సినిమా చేసినా హిట్టు.. కాదు సూపర్ హిట్టు అనే రేంజ్‌లో క్రేజ్‌ను తన సొంతం చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇక తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటిన ఈ బ్యూటీ ప్రస్తుతం కేవలం స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. అంతేగాక భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటూ దర్శకనిర్మాతల హాట్ ఫేవరెట్ అయ్యింది. అయితే ఇదంతా గతం అంటున్నారు సినీ విమర్శకులు.

Pooja Hegde : స్టోరీ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి

ప్రస్తుతం పూజా హెగ్డే పేరు చెబితేనే స్టార్ హీరోలు, నిర్మాతలు భయడపతున్నారట. ఇంతకీ వారు ఆమెను చూసి ఎందుకు భయపడుతున్నారు? మొన్నటివరకు పూజా హెగ్డే అంటే గోల్డెన్ హ్యాండ్. ఆమె ఏ సినిమాను పట్టుకున్నా, అది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ ప్రస్తుతం ఆమె బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఎంత ఘోరంగా పరాజయం పాలయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక తన తొలి తమిళ సినిమాను స్టార్ హీరో విజయ్‌తో కలిసి బీస్ట్ అనే మూవీలో నటించింది. ఈ సినిమా కూడ అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. అయితే తమిళనాట మాత్రం విజయ్ అభిమానులు ఈ సినిమాను ఆదరిస్తూ వచ్చినా ఫలితం లేకుండా పోయింది.

Pooja Hegde: పాపం పూజ.. సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్న నెటిజన్లు!

ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ, తాజాగా ఆచార్య చిత్రంలోనూ నటించింది. అయితే ఈ సినిమాలో అమ్మడి పాత్రను పట్టించుకున్న వారే లేరు. ఆచార్య సినిమా మొత్తం చిరంజీవి, చరణ్‌ల చుట్టే తిరగడంతో నీలాంబరి అనే పాత్రలో కేవలం ఓ పాట కోసమే పూజాను తీసుకున్నట్లుగా అనిపించింది. ఇక ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నా, మెగా ఫ్యాన్స్ ఆశించిన రీతిలో ఈ సినిమా లేదని వారు భావిస్తున్నారు. దీంతో పూజా హెగ్డే గోల్డెన్ హ్యాండ్ కాదు ఐరన్ లెగ్‌గా మారిందనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇకనైనా పూజా సరైన పాత్రలు ఎంచుకుని తిరిగి సక్సెస్‌ను అందుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.