Poonam Kaur: పూనమ్ కౌర్‌కు ఇద్దరు పిల్లలు.. నన్ను కాస్త బతకనివ్వండని ట్వీట్!

తనకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారని వస్తున్న వార్తలపై పూనమ్ కౌర్ రియాక్ట్ అయింది. 'ఇప్పటి వరకు నాకు జరిగిన డ్యామేజ్ చాలు. వాళ్లు నా ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థ్యాంక్స్.. నేను క్లారిటీ ఇవ్వగలను.

Poonam Kaur: పూనమ్ కౌర్‌కు ఇద్దరు పిల్లలు.. నన్ను కాస్త బతకనివ్వండని ట్వీట్!

Poonam Kaur

Poonam Kaur: ప్రముఖ హీరోయిన్, నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే పూనమ్ పై అదే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కథనం వస్తూనే ఉంటుంది. పూనమ్ కౌర్ పెట్టే స్టేటస్, ట్వీట్లు, రాతలు కూడా అలానే ఉంటాయి. ఒక స్టార్ హీరోను ఉద్దేశించి అన్నట్లుగా ట్వీట్ చేసే పూనమ్ ఆ హీరోను పొగుడుతూ, విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉంటుంది. ఇక గురూజీ అంటూ ఓ స్టార్ దర్శకుడిని ఉద్దేశించి దారుణంగా ఆరోపణలు చేస్తూ ట్వీట్లు వేస్తుంటుంది.

Poonam Kaur : మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్..

అయితే.. ఆ విమర్శలు, ట్వీట్లు వాళ్ళని ఉద్దేశించే అన్నట్లు ఇంతవరకు ప్రత్యక్షంగా చెప్పింది లేదు.. కానీ వాళ్లనే అన్నట్లు హింట్స్ మాత్రం ఇస్తూనే ఉంటుంది. నెటిజన్లు కూడా పూనమ్ గురించి ఏ సమాచారం దొరికినా స్పందించేస్తూ ఉంటారు. తాజాగా పూనమ్ ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫోటో ఒకటి నెటిజన్లకు దొరికింది. ఆ పిల్లలు పూనమ్ పిల్లలే అంటూ ప్రచారం మొదలవడం.. కొన్ని వెబ్ సైట్స్ దొరికిందే ఛాన్స్ అని పూనమ్ ఇద్దరు పిల్లల తల్లి అంటూ రాసేయడంతో ఇది కాస్త తెగ వైరల్ అయిపొయింది. దీంతో పూనమ్ దీనిపై స్పందించి ట్వీట్ చేసింది.

Poonam Kaur: బావ మూవీ హిట్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!

తనకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారని వస్తున్న వార్తలపై పూనమ్ కౌర్ రియాక్ట్ అయింది. ‘ఇప్పటి వరకు నాకు జరిగిన డ్యామేజ్ చాలు. వాళ్లు నా ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థ్యాంక్స్.. నేను క్లారిటీ ఇవ్వగలను. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. బతకనివ్వండి’ అంటూ పూనమ్ ట్వీట్ వేసింది. మరి ఇకనైనా ఈ గ్లోబల్ ప్రచారం ఆగుతుందో లేదో చూడాలి. కాగా.. చాలా కాలంగా సినిమాలలో పెద్దగా యాక్టివ్ లేని పూనమ్ తెలుగులో నాతిచరామి అనే సినిమా చేస్తుండగా ఆ సినిమాపై పెద్దగా ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు.