Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

కౌంట్ డౌన్ రెడీ.. ఇంకా నెల రోజులే.. ధియేటర్లు దద్దరిల్లడానికి. ఇంకా నెల రోజులే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి. ఇంకా నెలరోజులే ఫాన్స్ కి పూనకాలు రావడానికి. అవును సరిగ్గా..

Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

Bheemla Nayak

Bheemla Nayak: కౌంట్ డౌన్ రెడీ.. ఇంకా నెల రోజులే.. ధియేటర్లు దద్దరిల్లడానికి. ఇంకా నెల రోజులే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి. ఇంకా నెలరోజులే ఫాన్స్ కి పూనకాలు రావడానికి. అవును సరిగ్గా నెలరోజుల తర్వాత రిలీజ్ కాబోతున్న భీమ్లానాయక్ కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు పవన్ ఫాన్స్.

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

పవన్ ఫాన్స్ పండగ చేస్కోడానికి ఇంకా నెల రోజులే ఉంది. ధియేటర్లో పూనకాలతో ఊగిపోవడానికి నెల రోజులే ఉంది. ఫిబ్రవరి 25న ఇంకా నెల రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న భీమ్లానాయక్ సినిమాకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు ఫాన్స్. రిలీజ్ డేట్ లో ఏమాత్రం మార్పు లేదని, ఆల్రెడీ ఓవర్సీస్ లో సినిమా రిలీజ్ పనులు స్పీడప్ అవుతున్నాయని తెలిసి ఫుల్ ఖుష్ అవుతున్నారు ఫాన్స్.

Chiranjeevi-CM KCR: మెగాస్టార్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం కేసీఆర్!

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కుతున్న కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమ్లానాయక్ మూవీ లాస్ట్ స్టేజ్ లో ఉంది. సంక్రాంతి బరిలో దిగాల్సి ఈ సినమా లేట్ అయినా.. ఫాన్స్ మాత్రం పవన్ ని చూసేది ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ తో విపరీతమైన ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈసినిమా రిలీజ్ కు ఇంకా నెలరోజులే టైముంది.

RRR: ఆర్ఆర్ఆర్ విడుదల మార్చిలో లేనట్లే.. అసలు కారణం ఇదే!

వకీల్ సాబ్ తర్వాత రాబోతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమ్లానాయక్ రీమేక్ మూవీ అయినా కూడా ఫస్ట్ నుంచి విపరీతమైన హైప్ సంపాదించుకుంది ఈ సినిమా. పవన్ కి బాగా కలిసొచ్చిన పోలీస్ క్యారెక్టర్ తో పాటు.. సినిమాలో ఫాన్స్ ని ఎంగేజ్ చేసే హై యాక్షన్ ఎపిసోడ్స్ తో రెడీ చేస్తున్నారు సినిమాని. ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఓవర్సీస్ లో గ్రాండ్ గా రిలీజ్ సందడి స్టార్ట్ చేస్తున్నారు పవన్ ఫాన్స్. కోవిడ్ అడ్డంపడి సినిమా రిలీజ్ ఉంటుందో లేదో అని డౌట్ పడిన ఫాన్స్ కి సినిమా రిలీజ్ డేట్ లో మార్పు లేదని చెప్పడంతో నెల రోజుల్లో ధియటేర్లో జరగబోయే మాస్ జాతరకి రెడీ అవుతున్నారు ఫాన్స్.