Prabhas : ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా.. మా సినిమా ఫీల్డ్ కి థియేటరే గుడి

Prabhas : ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా.. మా సినిమా ఫీల్డ్ కి థియేటరే గుడి

prabhas

Prabhas :  దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘సీతారామం’. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా, వైజయంతి మూవీస్ నిర్మించింది. సీత రామం సినిమా ఆగస్టు 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. బుధవారం సాయంత్రం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా వచ్చారు.

Manchu Vishnu : ‘మా’ అసోసియేషన్ లో ఉండే వాళ్ళనే సినిమాల్లోకి తీసుకోవాలి

సీతారామం ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ.. ”డైరెక్టర్ బ్యూటిఫుల్ మూవీస్ తీస్తారు. ఇందాకే ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. చాలా బాగా కట్ చేశారు. లవ్ స్టోరీ, యుద్ధం కలిపి తీయడం అంత ఈజీ కాదు. రష్యా, కాశ్మీర్ అంత చలిలో చాలా కష్టపడి తీశారు ఈ సినిమాని. 50 ఇయర్స్ నుంచి సినిమాలు తీయడం మాములు విషయం కాదు. దత్ గారి లాంటి నిర్మాత ఉండటం తెలుగు సినిమా అదృష్టం. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి, అలాంటి సినిమా ఇది. ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్ళడం మనేస్తామా ఇది కూడా అంతే. మా సినిమా ఫీల్డ్ కి థియేటరే గుడి. అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి. అలాగే ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక కూడా ఉంది” అని అన్నారు.