Prabhas : సమంతని వదిలేసి దీపికా పదుకొనెని కాపాడుతా అన్న ప్రభాస్.. ఎందుకో తెలుసా??

ఎపిసోడ్ లో కొంతమంది హీరోయిన్స్ ని ఇద్దరిద్దర్ని చూపిస్తూ ప్రభాస్ ని పలు ప్రశ్నలు అడిగాడు బాలయ్య. నయనతార, తమన్నాని చూపిస్తూ ఎవర్ని షాపింగ్ కి తీసుకెళ్తావ్ అంటే........

Prabhas : సమంతని వదిలేసి దీపికా పదుకొనెని కాపాడుతా అన్న ప్రభాస్.. ఎందుకో తెలుసా??

Prabhas wants to save deepika ratherthan samantha

Prabhas :  బాలకృష్ణ యాంకర్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంతో గ్రాండ్ సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండో సీజన్ లో కూడా ఏడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ వచ్చి అలరించాడు. ఈ ఎపిసోడ్ కి భారీ స్పందన వచ్చింది. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఈ షోని చూశారు. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీకి బాగా రీచ్ వచ్చింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయాలనుకున్నారు.

ఏడో ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ తో నడిపించి ఎనిమిదో ఎపిసోడ్ లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ ని కూడా తీసుకొచ్చారు. వీరి కాంబినేషన్ ఎపిసోడ్ నేడు జనవరి 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల్లో బాగా రీచ్ అవుతుంది. ఎనిమిదో ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ రచ్చ రచ్చ చేశారు. ఎపిసోడ్ ఆద్యంతం నవ్వించారు, అలరించారు, ఎన్నో గుర్తుండిపోయే మూమెంట్స్ ని ప్రేక్షకులకి అందించారు.

ఎపిసోడ్ లో కొంతమంది హీరోయిన్స్ ని ఇద్దరిద్దర్ని చూపిస్తూ ప్రభాస్ ని పలు ప్రశ్నలు అడిగాడు బాలయ్య. నయనతార, తమన్నాని చూపిస్తూ ఎవర్ని షాపింగ్ కి తీసుకెళ్తావ్ అంటే ఇద్దర్ని అని చెప్పాడు. అలాగే పూజా హెగ్దే, శ్రద్ధా కపూర్ ఫోటోలని చూపించి ఇద్దరిలో ఎవరితో కలిసి సినిమాకి వెళ్తావు అని అడిగితే ఇద్దర్ని తీసుకెళ్లను అని సరదాగా చెప్పాడు ప్రభాస్. మరో ఇద్దరు హీరోయిన్స్ ని చూపించి వీళ్ళతో ఎవరితో నే ఫోన్ మార్చుకోవాలనుకుంటావు అని అడిగితే ఫోన్ ఎవరి పర్సనల్ వాళ్ళది, వాళ్ళకి కూడా పర్సనల్ అసలు ఇది వర్కౌట్ అవ్వదు అని అన్నాడు. అలాగే కృతి సనన్, అనుష్క శెట్టి ఫోటోలని చూపించి ఎలాగో వీళ్ళతో రూమర్స్ వస్తున్నాయి, ఒకవేళ వీళ్ళతో డేటింగ్ లో ఉన్నట్టు రూమర్స్ వస్తే ఎవరితో నిజం అని నమ్ముతారు అని అడిగితే ఎవర్ని నమ్మరు అని ప్రభాస్ అన్నా అక్కడ ఉన్న ప్రేక్షకులంతా అనుష్క పేరు చెప్పారు.

Prabhas : ప్రభాస్‌కి చిరాకొచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా??

ఇక సమంత, దీపికా పదుకొనె ఫోటోలని చూపించి వీళ్ళిద్దరూ సముద్రంలో పడిపోతే ఎవర్ని కాపాడతావు అని అడిగితే ఆలోచించకుండా వెంటనే దీపికా పదుకొనె అని చెప్పాడు ప్రభాస్. బాలకృష్ణ అదేంటి ఎందుకు అని అడగడంతో.. అంటే ప్రస్తుతం ప్రాజెక్ట్ k సినిమా నడుస్తుంది, అందులో తనే హీరోయిన్, సినిమా ఆగిపోకూడదు కదా అని తెలివిగా సమాధానం ఇవ్వడంతో బాలయ్య ఆశ్చర్యపోయారు.