Priyanka Chopra : నన్ను నల్లపిల్లి అని వెక్కిరించేవాళ్ళు..

వరుస హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇటీవలే ఇండియాకి వచ్చింది. ఇక్కడే కొన్ని రోజులు ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మీడియాకి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో..................

Priyanka Chopra : నన్ను నల్లపిల్లి అని వెక్కిరించేవాళ్ళు..

 

Priyanka Chopra :  బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగాక హాలీవుడ్ కి చెక్కేసి అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తుంది ప్రియాంక చోప్రా. సినిమాల్లోకి అడుగుపెట్టకముందే మిస్ వరల్డ్ టైటిల్ తో పాపులర్ అయింది ఈ భామ. ఇక నాలుగేళ్ల క్రితం తనకంటే చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ ని పెళ్లి చేసుకొని అమెరికాకి మకాం మార్చేసింది. అప్పట్నుంచి అమెరికాలోనే ఉంటుంది. ఇటీవలే కొన్ని నెలల క్రితం సరోగసి ద్వారా ఓ పాపకి జన్మనిచ్చింది.

వరుస హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇటీవలే ఇండియాకి వచ్చింది. ఇక్కడే కొన్ని రోజులు ఉంటుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మీడియాకి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో తన అందంపై కామెంట్స్ చేశారని తెలిపింది.

RGV : అషు రెడ్డి పాదాలను ముద్దాడుతున్న RGV.. వైరల్ అవుతున్న వీడియో..

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ”కెరీర్ మొదట్లో నా అందంపై కామెంట్స్ చేసేవాళ్ళు. నన్ను డస్కీ అని, నల్ల పిల్లి అని పిలిచేవాళ్లు. మొదట్లో డస్కీ అంటే అర్ధం తెలీదు ఆ తర్వాత తెలిసి బాధపడ్డాను. షూట్స్ లో నన్ను ఎక్కువగా వెయిట్ చేయించేవారు. నా అందంపై కామెంట్స్ చేస్తూ వెటకారంగా మాట్లాడేవాళ్ళు” అని అప్పటి అనుభవాలని తెలిపింది. ఒకప్పుడు అలా పిలిపించుకున్న ప్రియాంక అదే బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగి అనంతరం ఇప్పుడు హాలీవుడ్ లో కూడా స్టార్ గా వెలుగుతుంది.