Tollywood Crazy Films: క్రేజీ కాంబోలు.. ఎటు చూసినా ప్రమోషన్ల రచ్చే!

సినిమా ఎంత కష్టపడి తీసినా.. ఫుల్ ఓపెనింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టాలంటే ప్రమోషన్స్ గట్టిగా ఉండాల్సిందే. అందుకే నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రచార కార్యక్రమాలను షురూ చేస్తున్నారు..

Tollywood Crazy Films: క్రేజీ కాంబోలు.. ఎటు చూసినా ప్రమోషన్ల రచ్చే!

Tollywood Crazy Films (1)

Tollywood Crazy Films: సినిమా ఎంత కష్టపడి తీసినా.. ఫుల్ ఓపెనింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టాలంటే ప్రమోషన్స్ గట్టిగా ఉండాల్సిందే. అందుకే నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రచార కార్యక్రమాలను షురూ చేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. డిసెంబర్ నుంచి వరుసగా రాబోతున్న సినిమాల ప్రమోషన్స్ అన్నీ ఓ రేంజ్ లో జరుగబోతున్నాయి. టాలీవుడ్ లో ప్రమోషన్ల హడావుడీ షురూ అయింది. వరుసగా పెద్ద సినిమాలు.. పెద్ద స్టార్స్ సినిమాలు క్యూకట్టడంతో అదే రేంజ్ లో ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. డిసెంబర్ 2న బాలయ్య అఖండ థియేటర్స్ లోకి దిగబోతుంది.

Telugu Upcoming Films: పాపం హీరోలు.. హీరోయిన్సే దొరకట్లేదు!

ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ ప్లాన్స్ వేసారు. ఈరోజే (నవంబర్ 27) జరుగబోయే అఖండ ఫంక్షన్ లో ఐకాన్ స్టార్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారబోతున్నారు. మెగా ముద్ర మాత్రమే కాకుండా అందరివాడు అనిపించుకునేందుకు ట్రై చేస్తోన్న బన్నీ.. బాలయ్యతో స్టేజ్ షేర్ చేసుకోబోతున్నాడు. ఎలాగూ ఆహా ప్లస్ అల్లు అరవింద్ తో మంచి బాండింగ్ ఏర్పడింది బాలకృష్ణకి. సో అఖండను ఫుల్ స్వింగ్ లో అందరూ కలిసి ప్రమోట్ చేయబోతున్నారు. ఇప్పటికే సింగిల్స్, ట్రైలర్స్ తో అంచనాలు పెంచేసిన బాలయ్య.. డిసెంబర్ 2 వరకు ప్రమోషన్స్ తో దబిడి దిబిడి చేయబోతున్నారు.

Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది

పుష్పకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సింగిల్స్, టీజర్స్ కి ఊహించనంత రెస్పాన్స్ దక్కింది. దీంతో డిసెంబర్ 17 ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇంకా ఎక్కువ రోజులు గ్యాప్ కూడా లేకపోవడంతో పుష్ప ప్రమోషన్స్ పీక్ కు తీసుకెళ్లాలనే ప్లానింగ్ లో ఉన్నారు. లేటెస్ట్ నాలుగో సింగిల్ ఊపేస్తోన్న ఈ టైంలో అసలైన ప్రమోషనల్ బాంబ్ పుష్ప ట్రైలర్ కొన్ని రోజుల్లోనే రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ తర్వాత వెంటనే ఐదో సింగిల్.. సామ్ ఐటమ్ సాంగ్ రచ్చ చేస్తుంది. ఆపై డిసెంబర్ 3న దుబాయ్ లో ఈవెంట్ అన్నారు కానీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఇండియాలోని ఇంపార్టెంట్ నగరాల్లో పుష్ప టీం సందడి ఉండబోతుంది. ఇక పుష్పపై ఫుల్ హైప్ తీసుకొచ్చేలా డిసెంబర్ 12న హైదరాబాద్ లో ఓ గ్రాండ్ ఈవెంట్ కి స్కెచ్ వేసారు.

Prabhas : డిసెంబర్‌ నుంచి ‘ప్రాజెక్టు K’ చిత్రీకరణ.. జెట్‌స్పీడ్‌లో ప్రభాస్

పుష్ప రాజ్ తర్వాత డిసెంబర్ 24న థియేటర్స్ కి రాబోతున్నాడు శ్యామ్ సింగ రాయ్. ప్రమోషన్స్ ని ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యేలా డిఫరెంట్ గా ప్లాన్ చేసే నాని.. ఈసారి అలాంటి అస్త్రాలనే సంధించబోతున్నాడు. ప్రెస్ మీట్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే కాకుండా, ఈ సినిమా టీమ్ మేజర్ సిటీస్ కి తిరుగబోతుంది. ఎక్కడికక్కడ పెద్ద సంఖ్యలో జనాలను కలిసి, వాళ్లలో ఈ మూవీపై ఫుల్ క్రేజ్ తీసుకొచ్చేలా కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక్కొక్క సిటీలో 3 వేల మంది అభిమానులతో ‘ఫ్యాన్ మీట్’ ను కూడా ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు.

Mahesh Babu: త్వరలో సూపర్ స్టార్ మరో సైడ్ బిజినెస్?

జనవరి 7న రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ కోసం వచ్చే నెల నుంచి వరుస ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు రీసెంట్ గా రాజమౌళి హింట్ ఇచ్చారు. నెక్స్ట్ మంత్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగబోతుందని.. ఓ రేంజ్ లో మల్టిపుల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా ప్రమోషన్స్ లిస్ట్ లో ఉన్నాయని చెప్పకనే చెప్పారు. ఇక మీడియా స్పెషల్ మీట్ లో భాగంగా హీరోహీరోయిన్లతో పాటు మూవీ యూనిట్ మొత్తం సందడి చేయబోతుంది. అలాగే దుబాయ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసి.. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ , చెన్నై లాంటి సిటీస్ లో వేర్వెరుగా ఫంక్షన్స్ ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే నేషనల్ వైడ్ గా మన టాలీవుడ్ సినిమా టాక్ ఆఫ్ ది నేషన్ గా మారనుంది.

Film Releases: కళకళలాడుతున్న థియేటర్లు.. ఈ వారం సినిమాలివే!

క్రిస్మస్ తర్వాత డార్లింగ్ ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నారు. ఇండియాలోని మెయిన్ సిటీస్‌ లో ఏర్పాటు చెయ్యబోయే ప్రమోషన్స్‌ కి ప్రభాస్ అటెండ్ అవబోతున్నారు. జనవరి 14న రిలీజ్ కాబోయే ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ గురించి ఇప్పటికీ కాస్త సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మేకర్స్. భీమ్లానాయక్, బంగార్రాజు ఎవరి ప్లాన్స్ వాళ్లు రెడీ చేసుకుంటున్నారు. అప్పటివరకైతే సింగిల్స్, టీజర్స్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో ఓ ఊపు ఊపాలని డిసైడయ్యారు. భీమ్లా నాయక్ ఎలాగూ తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ కాబట్టి పవర్ స్టార్ స్టామినా ఒక్క స్ట్రాంగ్ ఈవెంట్ లోనే చూపించినా ఆశ్చర్యం లేదు.