James: జేమ్స్‌గా రానున్న పునీత్.. చివరి సినిమాతో ఘననివాళి!

హఠాన్మరణంతో కన్నడ ప్రజలకు శోకాన్ని మిగిల్చిన పునీత్ రాజ్ కుమార్.. తన చివరి సినిమా జేమ్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే జేమ్స్ తో పునీత్ కు ఘనమైన నివాళి అందించాలను..

James: జేమ్స్‌గా రానున్న పునీత్.. చివరి సినిమాతో ఘననివాళి!

James

James: హఠాన్మరణంతో కన్నడ ప్రజలకు శోకాన్ని మిగిల్చిన పునీత్ రాజ్ కుమార్.. తన చివరి సినిమా జేమ్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే జేమ్స్ తో పునీత్ కు ఘనమైన నివాళి అందించాలనుకుంటోన్న శాండిల్ వుడ్… దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడి నుంచి చిరూ, తారక్ జేమ్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం వెళ్తున్నారు.

James : పునీత్ చివరి సినిమా నుంచి సాంగ్ రిలీజ్

పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ ను బాగా ప్రమోట్ చేస్తోంది శాండిల్ వుడ్. ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి ఇదే అన్నట్టు.. జేమ్స్ కోసం పెద్ద ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసింది కన్నడ ఇండస్ట్రీ. మార్చ్ 17న సినిమా రిలీజ్ సందర్బంగా మార్చ్ 6న ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు.

James: పునీత్ చివరి సినిమా కోసం మెగాస్టార్-తారక్?

జేమ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి, యన్టీఆర్ లను చీఫ్ గెస్టులుగా ఆహ్వానించారు. దానికి చిరు, తారక్ లు ఓకే చెప్పారని సమాచారం. పునీత్ తో మంచి అనుబంధం ఉన్న చిరూ, తారక్ ఇద్దరూ ఒకే స్టేజ్ పై జేమ్స్ కోసం కనిపించబోతున్నారు. తెలుగులో కూడా జేమ్స్ సినిమా రాబోతుంది కాబట్టి.. ఇక్కడ ఆ సినిమాను ప్రమోట్ చేసి.. తమవంతు బాధ్యతను తెలుగు స్టార్స్ చేపడుతున్నారు.

James: అప్పూ వస్తున్నాడు.. పునీత్ లాస్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి కావడంతో జేమ్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని శరవేగంగా చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ క్యారెక్టర్ కి ఆయన పెద్దన్న శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పి తమ్ముడికి ఘనమైన నివాళి అర్పించారు. రీసెంట్ గా విడుదలైన జేమ్స్ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. పాన్ ఇండియా రేంజ్ లో ముఖ్యమైన అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. మార్చ్ 17 నుంచి 23 దాకా కన్నడ థియేటర్స్ లో మరో సినిమా లేకుండా చూస్తున్నారు.