James : పునీత్ చివరి సినిమా ఇవాళే రిలీజ్.. కర్ణాటక థియేటర్స్ హౌస్ ఫుల్..

పునీత్ చివరి సినిమా 'జేమ్స్' కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు మార్చి 17 పునీత్‌ జయంతి సందర్భంగా 'జేమ్స్' సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కన్నడతో పాటు.....

James : పునీత్ చివరి సినిమా ఇవాళే రిలీజ్.. కర్ణాటక థియేటర్స్ హౌస్ ఫుల్..

Puneeth

 

Puneeth Rajkumar :  కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులకు, కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు కన్నడ ప్రజలకు కూడా తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తర్వాత నేటికీ ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు, ఎంతో మంది ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.

పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు మార్చి 17 పునీత్‌ జయంతి సందర్భంగా ‘జేమ్స్’ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కన్నడతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 4,000 థియేటర్లలో ఈ సినిమా భారీగా విడుదలవుతోంది. ఈ సినిమాలో అప్పూ ఒక భద్రతాసంస్థలో మేనేజర్‌, సైన్యాధికారిగా రెండు పాత్రలు పోషించాడు. ప్రియా ఆనంద్‌ హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్ విలన్ గా నటించారు. ఈ సినిమాలోని ఫైట్స్ పునీత్ కంపోజ్ చేయడం విశేషం.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కి మైసూర్ విశ్వ విద్యాలయం డాక్టరేట్

ఇక పునీత్ చివరి సినిమా కావడంతో అభిమానులతో పాటు, కన్నడ ప్రజలు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ వీకెండ్ ఆదివారం వరకు కర్ణాటక లోని అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ వారం రోజులు ఇంకే సినిమా రిలీజ్ చేయకూడదు, అన్ని థియేటర్స్ లోను ‘జేమ్స్’ సినిమానే రిలీజ్ అవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి వారం రోజుల వరకు ఇతర సినిమాలేవీ కర్ణాటకలో విడుదల చేయొద్దని కన్నడ పరిశ్రమ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

Raj Tharun : ‘స్టాండప్ రాహుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఇక థియేటర్ల వద్ద ఇప్పటికే అభిమానులు కోలాహలం మొదలైంది. పునీత్ భారీ కటౌట్స్, బ్యానర్స్ కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. పునీత్ కటౌట్స్ కి పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక థియేటర్లతో పాటు ఈ రోజు పునీత్ సమాధిని సందర్శించడానికి కూడా జనాలు తరలి వస్తున్నారు.