Chiranjeevi: నటుడిగా రాఘవేంద్రరావు.. మెగాస్టార్ డైరెక్షన్!

కుడి ఎడమైతే పొరపాటు కాదోయ్ అని ఓ పాత పాట మాదిరి ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ మీద ఆసక్తికర చర్చ జరుగుతుంది. మౌనముని.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదని తెలిసిందే. ఆయన దర్శకత్వంలో పనిచేయాలని హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా పోటీపడే వారు. ఆయన టేకింగ్ లో హీరోయిన్స్ అందంగా కనిపించడంతో పాటు సరికొత్తగా వెలిగిపోయేవారు.

Chiranjeevi: నటుడిగా రాఘవేంద్రరావు.. మెగాస్టార్ డైరెక్షన్!

Chiranjeevi

Chiranjeevi: కుడి ఎడమైతే పొరపాటు కాదోయ్ అని ఓ పాత పాట మాదిరి ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ మీద ఆసక్తికర చర్చ జరుగుతుంది. మౌనముని.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదని తెలిసిందే. ఆయన దర్శకత్వంలో పనిచేయాలని హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా పోటీపడే వారు. ఆయన టేకింగ్ లో హీరోయిన్స్ అందంగా కనిపించడంతో పాటు సరికొత్తగా వెలిగిపోయేవారు. దర్శకుడిగా ఎన్నో సినిమాలను తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు తెరవెనుక నుండి తెరమీదకి వస్తున్నారు.

రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్న సినిమా ‘పెళ్లి సందD’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రాఘవేంద్రరావు వశిష్ట అనే పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాలో ఆయన లుక్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేయగా ఇందులో రాఘవేంద్రరావు స్టైలిష్ గెటప్ చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినీ తారలు సైతం రాఘవేంద్రరావుకి విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ఈ గెటప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఈ రాఘవేంద్రుడి లుక్ చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాఘవేంద్రరావు వెండి తెర మీద కనిపిస్తే.. ఆ వెండితెర కూడా మురిసిపోతుందంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇదే సమయంలో రాఘవేంద్రరావు నటుడిగా మారడంతో చిరంజీవిలో ఓ ఆలోచన వచ్చిందట. రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో చిరు ఓ సినిమా డైరెక్ట్ చేయాలనుకొని.. ఇదే విషయాన్ని రాఘవేంద్రరావుకి చెప్పారట. చిరు అలా చెప్పగానే.. రాఘవేంద్రరావు ‘నాకు ఇప్పుడే టెన్షన్ స్టార్ట్ అయింది’ అంటూ బదులిచ్చారట.

రీసెంట్ కొందరు మీడియా సభ్యులతో ఇంటరాక్ట్ అయిన చిరు.. రాఘవేంద్రరావుతో జరిగిన సంభాషణను స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే.. ఇది ఎంత మాత్రం సెట్ అవుతుందన్నది పక్కన పెడితే అసలు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందా అని ఇప్పుడు ఇటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో చర్చగా మారింది. దర్శకేంద్రుడు నటుడైతే.. మెగాస్టార్ మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేయడం చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. మరి ఈ కాంబినేషన్ సెట్ చేయాలని ఏ నిర్మాతైనా బలంగా భావిస్తే ఈ కల కూడా తీరొచ్చేమో!