Rajani-Ajith: తలైవాతో తలా పోటీ.. మరింత మజాగా దీపావళి!

తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు రజనీకాంత్, అజిత్. ఆ మాటకొస్తే రజనీ సౌత్ సూపర్ స్టార్ కూడా. తమిళంలో అజిత్ అభిమానానికి హద్దే ఉండదు. ఇంతటి ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఢీ అంటే ఢీ అనేలా సినిమాలు తీసుకొస్తున్నారు.

Rajani-Ajith: తలైవాతో తలా పోటీ.. మరింత మజాగా దీపావళి!

Rajani Ajith

Rajani-Ajith: తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు రజనీకాంత్, అజిత్. ఆ మాటకొస్తే రజనీ సౌత్ సూపర్ స్టార్ కూడా. తమిళంలో అజిత్ అభిమానానికి హద్దే ఉండదు. ఇంతటి ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఢీ అంటే ఢీ అనేలా సినిమాలు తీసుకొస్తున్నారు. అది కూడా దీపావళికి ఇద్దరూ ముహూర్తం పెట్టేయడంతో ఇప్పుడు ఈ దివాళీ మరింత మజాగా మారనుంది.

రజినీ హీరోగా నటిస్తున్న అన్నాత్తే ఈ ఏడాది దీపావళికు విడుదల చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీతో మరోసారి నయనతార జోడీ కట్టింది. సన్ పిక్చర్స్ వంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈసారి దీపావళి బరిలోకి దిగేందుకు అజిత్ కూడా సిద్దమయ్యాడు. అజిత్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ వాలిమై సిద్ధమైంది. ఇందులో అజిత్ జోడిగా జాన్వీకపూర్ నటిస్తుండగా బోని కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ కింద నిర్మిస్తున్నారు.

హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాలిమైలో యామి గౌతమ్, హుమ కురేశి, పవేల్ నవగీతన్, కార్తికేయ గుమ్మకొండ, యోగిబాబ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా ఇండస్ట్రీని శాసించే హీరోల సినిమాలు కావడంతో ఇప్పుడు కోలీవుడ్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక్క తమిళంలోనే కాకుండా ఈ రెండు సినిమాలు ఇండియా మొత్తం విడుదల కానున్నాయి.