Aishwarya Rajinikanth: ఘనంగా ‘లాల్ సలామ్’ పూజ కారిక్రమాలు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్.. గెస్ట్ అప్పీరెన్స్‌లో రజిని..

సూపర్ స్టార్ రజినికాంత్ కూతురు 'ఐశ్వర్య రజినీకాంత్' మరోసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకోనుంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన '3' సినిమాతో దర్శకురాలిగా మొదటిసారి మెగా ఫోన్ పట్టుకోగా, ఇప్పుడు తన కెరీర్ లో మూడో సినిమాను తెరకెక్కించబోతుంది. అయితే ఈ సినిమాలో తన తండ్రి రజినీకాంత్ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఉండనుంది అంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది.

Aishwarya Rajinikanth: ఘనంగా ‘లాల్ సలామ్’ పూజ కారిక్రమాలు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో విష్ణు విశాల్.. గెస్ట్ అప్పీరెన్స్‌లో రజిని..

Rajinikanth plays a guest role in his daughter Aishwarya directorial movie

Updated On : November 10, 2022 / 9:23 PM IST

Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ రజినికాంత్ కూతురు ‘ఐశ్వర్య రజినీకాంత్’ మరోసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకోనుంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘3’ సినిమాతో దర్శకురాలిగా మొదటిసారి మెగా ఫోన్ పట్టుకోగా, ఇప్పుడు తన కెరీర్ లో మూడో సినిమాను తెరకెక్కించబోతుంది. అయితే ఈ సినిమాలో తన తండ్రి రజినీకాంత్ స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ ఉండనుంది అంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది.

NTR and Rajinikanth : పునీత్‌ రాజ్‌కుమార్‌కి కర్ణాటక రత్న అవార్డు ప్రదానోత్సవంలో ఎన్టీఆర్, రజినీకాంత్

ఈ సినిమా పూజ కారిక్రమాలు నేడు ఘనంగా జరుపుకోగా.. తన మునుపటి చిత్రాలకు పని చేసిన పాత టీంనే ఐశ్వర్య ఈ సినిమా కూడా ఎంచుకుంది. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “లాల్ సలామ్” అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ సినిమా క్రీడా మరియు మత కల్లోల కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఐశ్వర్య ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహిస్తుంది. తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా నటిస్తుండగా, విక్రాంత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఏడేళ్ల తర్వాత మళ్లీ డైరెక్షన్‌లోకి వస్తున్న ఐశ్వర్య రజనీకాంత్ కొంచెం ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది. “మీ తండ్రి మీపై నమ్మకం ఉంచినప్పుడు. దేవుడు మీ దగ్గర ఉన్నాడని మీరు నమ్మినప్పుడు. అద్భుతాలు నిజమవుతాయి. ఏడు సంవత్సరాల తర్వాత నా ప్రయాణం మళ్లీ ప్రారంభమవుతుంది” అంటూ రాసుకొచ్చింది.