Rajinikanth: రేపే రజినీకాంత్ సినిమా.. చడీచప్పుడు లేకుండా రిలీజ్ చేస్తున్న మేకర్స్!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఎలాంటి మేనియా ఉంటుందో మనం గతంలో చాలా సార్లు చూశాం. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రజినీకాంత్ సినిమా అంటే ఆ సినిమా కోసం ఏరేంజ్‌లో ఎదురుచూస్తుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాను చడీచప్పుడు లేకుండా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ఎలాంటి మేనియా ఉంటుందో మనం గతంలో చాలా సార్లు చూశాం. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రజినీకాంత్ సినిమా అంటే ఆ సినిమా కోసం ఏరేంజ్‌లో ఎదురుచూస్తుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాను చడీచప్పుడు లేకుండా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. శంకర్-రజినీ కాంబినేషన్‌లో ప్రస్తుతం ఏ సినిమా వస్తుందని ఆలోచిస్తున్నారా.. ఈ కాంబోలో గతంలో వచ్చిన ఓ సినిమాను మరోసారి రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
Rajinikanth Baba Movie Re-Release: పాత సినిమాలో కొత్త క్లైమాక్స్… తలైవా ఇక్కడ!
రజినీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మూవీ ‘శివాజి ది బాస్’ 2007లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రజినీ యాక్టింగ్, శంకర్ స్టోరీ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అందాల భామ శ్రియా సరన్ హీరోయిన్‌గా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ఆయన నటించిన ‘బాబా’ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Rajinikanth : కూతురి దర్శకత్వంలో రజినీకాంత్.. గెస్ట్ అప్పీరెన్స్‌గా..
కాగా, శివాజి చిత్రాన్ని డిసెంబర్ 9 – 15 మధ్య పివిఆర్, సినీపోలిస్ చైన్స్‌కు సంబంధించిన థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమా కేవలం తమిళ్, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఏదేమైనా రజినీకాంత్ సినిమాను ఇంత సైలెంట్‌గా రిలీజ్ చేయడం ఏమిటని ఆయన అభిమానులు అంటున్నారు. బాస్ మూవీ వస్తుందంటే థియేటర్ల వద్ద రచ్చ చేయాల్సిందే అంటున్నారు రజినీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్.