Rajinikanth Baba Movie Re-Release: పాత సినిమాలో కొత్త క్లైమాక్స్… తలైవా ఇక్కడ!

రజినీ రెండు దశాద్దాల క్రితం నటించిన ఓ అట్టర్ ఫ్లాప్ మూవీని ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నారు. రజినీకాంత్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ‘బాబా’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ కావడంతో, అప్పట్లోనే ఈ సినిమా భారీ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది.

Rajinikanth Baba Movie Re-Release: పాత సినిమాలో కొత్త క్లైమాక్స్… తలైవా ఇక్కడ!

Rajinikanth Baba Movie Re-Release To Have New Climax

Rajinikanth Baba Movie Re-Release: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే కేవలం తమిళనాటే కాకుండా యావత్ సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. ఇక ఆయన సినిమా రిలీజ్ రోజున యావత్ సౌత్ ఇండియా రజినీ మేనియాతో ఎలా ఊగిపోతుందో మనం గతంలో చూశాం. అయితే ఇటీవల రజినీ చేస్తున్న సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదనేది వాస్తవం. దీంతో ఆయన ఈసారి ఆచితూచి తన నెక్ట్స్ చిత్రాలను ఎంపిక చేయాలని చూస్తున్నారు.

Rajinikanth : కూతురి దర్శకత్వంలో రజినీకాంత్.. గెస్ట్ అప్పీరెన్స్‌గా..

ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా, రజినీ రెండు దశాద్దాల క్రితం నటించిన ఓ అట్టర్ ఫ్లాప్ మూవీని ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నారు. రజినీకాంత్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ‘బాబా’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ కావడంతో, అప్పట్లోనే ఈ సినిమా భారీ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. పక్కా కమర్షియల్ అంశాలకు దైవత్వం అనే కాన్సెప్టును జోడించి ఈ సినిమాను దర్శకుడు సురేష్ కృష్ణ తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని చిత్ర మేకర్స్ భావిస్తున్నారు.

Rajinikanth: ‘2.O’ కలయికతో మరో సినిమా.. రజనీకాంత్ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు.. ముహూర్తం డేట్ ఫిక్స్!

అయితే ఈ సినిమాలోని క్లైమాక్స్ ను కొత్తగా మార్చి రీ-రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాల హీరోయిన్ గా నటించింది. రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.