Ram Charan: నాటు నాటు కాదు.. అంతకు మించి..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంత అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే....

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంత అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో మరో హీరోగా నటించాడు. ఇక తారక్, చరణ్ కలిసి చేసిన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అంతేగాక ఈ సినిమాలో ‘నాటు నాటు’ అనే పాటలో తారక్, చరణ్‌ల డ్యాన్స్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది.
Ram Charan: చరణ్ కోసం దిల్ రాజు భారీగా ఖర్చు పెడుతున్నాడుగా!
ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ పోటీపడి మరీ డ్యాన్స్ చేయడంతో ఈ పాట సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇక ఇప్పుడు ‘నాటు నాటు’ పాటకు మించిన డ్యాన్స్ చేసేందుకు చరణ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే వైజాగ్ షెడ్యూల్‌లో చరణ్‌పై కొన్ని ఆసక్తికరమైన సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొంటుంది. ఇక ఈ షెడ్యూల్ తరువాత ఓ సాంగ్‌ను షూట్ చేసేందుకు శంకర్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారట. అయితే ఈ పాట చాలా స్పెషల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Ram Charan: శంకర్ సినిమాలో చరణ్ అలా కనిపిస్తాడా..?
ఈ సాంగ్‌ను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నాడట. అయితే ఈ పాటలో చరణ్ కోసం అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేయబోతున్నారట. ఇది నాటు నాటు పాటలో చరణ్ చేసిన డ్యాన్స్‌కు రెండింతలుగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. అంటే.. ఈ పాటలో చరణ్ డ్యాన్స్‌లో తన అసలు రూపం చూపించబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ పాట ఈ చిత్రానికే హైలైట్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి నిజంగానే నాటు నాటు పాటలో చరణ్ చేసిన డ్యాన్స్‌కు రెండింతలుగా ఈ సినిమాలో సాంగ్ ఉండబోతుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను శంకర్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
- RRR: గెట్ రెడీ అంటోన్న ఆర్ఆర్ఆర్.. ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసిందిగా!
- RC15: సక్సెస్, ఫెయిల్యూర్ లెక్కేలేదు.. చెర్రీ బిజీ బిజీ!
- Acharya: ఆచార్య 10 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీ కొట్టేనా..?
- RC 15 : వైజాగ్‌లో రామ్ చరణ్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు…
- RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. 1 బిలియన్ వ్యూస్ దిశగా ఆల్బమ్
1Red Sandal : కడప జిల్లాలో ఎర్రచందనం డంప్ స్వాధీనం
2Viral video: ఇదేంది సారూ.. ఒకే సారి, ఒకే బోర్డుపై ఉర్దూ, హిందీ పాఠాల బోధన.. ప్రతీరోజూ అంతే..
3Congress : జనంలోకి కాంగ్రెస్.. ఈనెల 21 నుంచి రచ్చబండ
4Shivathmika Rajashekar : చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తున్న శివాత్మిక
5AP Politics : బీసీ ఓట్లే టార్గెట్ గా వైసీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభ సీటు..!
6Samantha : చైతూతో విడాకుల తర్వాత సమంత ఫస్ట్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
7Russia president: ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరికపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
8Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!
9Bihar : మూడు ఎకరాల భూమి కేసు..108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చిన కోర్టు !
10Green Cards : ఆరునెలల్లో గ్రీన్‌కార్డుల అప్లికేషన్లు క్లియర్ చేయండి
-
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
-
చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు
-
Sainath Sharma : టీడీపీ నేత సాయినాథ్‌శర్మకు చంపేస్తామంటూ బెదిరింపులు
-
Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
-
Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
-
PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్