క‌రోనాకే వార్నింగ్ ఇచ్చిన వర్మ

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 05:45 AM IST
క‌రోనాకే వార్నింగ్ ఇచ్చిన వర్మ

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఎంతోమంది భయాందోళన చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో కూడా రెండు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అందరూ ఈ వైరస్ కు భయపడుతుంటే.. మన కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మా మాత్రం ఏకంగా కరోనాకే వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 

డియ‌ర్ వైర‌స్‌, నువ్వు ఒక పారాసైట్ మాత్రమే అన్న విష‌యాన్ని మ‌ర‌చిపోకు. ఇలా అంద‌రిని చంపుకుంటూ వెళితే నువ్వు కూడా మాతో చ‌చ్చిపోతావు. నా మాట‌పై నీకు న‌మ్మ‌కం లేక‌పోతే వైరాలజీ క్రాష్‌ కోర్స్‌ తీసుకో.. అందుకే నా మాట విని నువ్వు బ్ర‌తుకు, మ‌మ్మ‌ల్ని బ్ర‌త‌క‌నివ్వు అంటూ ట్విట్ చేశాడు. అంతేకాదు మంగళవాారం (మార్చి 3,2020)న వర్మ సోషల్ మీడియాలో ఇంతకాలం ఎన్నో చైనీస్ వస్తువులను ఉపయోగించాం.. ఇప్పుడు చావు కూడా చైనాదేనా అంటూ కామెంట్ చేశారు.  

వర్మ ట్వీట్ లు చూసిన నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ చేస్తున్నారు. వైరస్ కి ట్విట్టర్ అకౌంట్ లేదని.. కావాలంటే హాస్పిటల్ కి వెళ్లి డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వండి అంటూ ట్విట్ కి కమెంట్స్ చేస్తున్నారు. 

ఇక కరోనా వైరస్‌ మీకు సోకడానికి ఒక్క తుమ్ము చాలని మీకు తెలుసా? మనం తుమ్మినప్పుడు ఓ లీటర్ బాటిల్‌లో పట్టేంత పరిమాణంలో గ్యాస్‌ విడుదలవుతుంది. ఇందులో తుంపరతో పాటు, క్రిములు కూడా ఉంటాయి. ఇవి సెకనుకు 35 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంటే ఇన్‌ఫెక్షన్‌తో ఉన్న ఎవరైనా తుమ్మితే.. దాని ప్రభావం వారికి 8 మీటర్ల దూరంలో ఉన్నవారిపైనా పడుతుంది.  అంతేకాదు.. AC ఉన్న దగ్గర అయితే.. ఈ తుంపర్లు గదంతా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తుమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి, ముఖానికి అడ్డుగా ఏదైనా పెట్టుకోండి.

See Also | బీరు బాటిళ్లతో దాడి ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్