Ram – Lakshman : వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి స్పెషల్ ఫైట్స్ గురించి చెప్పేసిన ఫైట్ మాస్టర్స్..

ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇద్దరు పెద్ద హీరోలకి వాళ్ళకి తగ్గట్టు కథని రెడీ చేసుకున్నారు దర్శకులు. రెండు సినిమాలు కథల పరంగా వేరు, వేరు. అందుకే ఫైట్స్ కూడా వేరు వేరుగా ఉండాలని, రెండు సినిమాలకి వైవిధ్యం చూపించాలని ముందే అనుకున్నాం. వాల్తేరు వీరయ్య సినిమాలో ముందు నుంచి మాస్ గా లుంగీ కట్టుకొని ఉన్న చిరంజీవి.........

Ram – Lakshman : వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి స్పెషల్ ఫైట్స్ గురించి చెప్పేసిన ఫైట్ మాస్టర్స్..

Ram - Lakshman tells about special fights in sankranthi movies

Ram – Lakshman :  ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాలు ఈ సారి సంక్రాంతికి ప్రేక్షకులని అలరించనున్నాయి. ఈ రెండు సినిమాలకి నిర్మాణ సంస్థ ఒకటే కావడం విశేషం. నిర్మాణ సంస్థ మాత్రమే కాదు హీరోయిన్ కూడా ఒకటే. కొన్ని పాటలకి డ్యాన్స్ మాస్టర్ కూడా ఒకరే కావడం మరింత ఆశ్చర్యం. అంతే కాకుండా ఈ రెండు సినిమాలకి కూడా ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్ లు కావడం మరింత విశేషం.

ఇలా ఈ రెండు సినిమాలకి చాలా విభాగాలకు ఒకరే పనిచేయడంతో సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఇప్పటికే టీజర్లు, సాంగ్స్ తో సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. రెండు సినిమాల్లోనూ మాస్ అంశాలు ఎక్కువగా ఉండటంతో సినిమాలకి ఫుల్ హైప్ ఉంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా వీర లెవల్లో చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇద్దరు పెద్ద హీరోలకి వాళ్ళకి తగ్గట్టు కథని రెడీ చేసుకున్నారు దర్శకులు. రెండు సినిమాలు కథల పరంగా వేరు, వేరు. అందుకే ఫైట్స్ కూడా వేరు వేరుగా ఉండాలని, రెండు సినిమాలకి వైవిధ్యం చూపించాలని ముందే అనుకున్నాం. వాల్తేరు వీరయ్య సినిమాలో ముందు నుంచి మాస్ గా లుంగీ కట్టుకొని ఉన్న చిరంజీవి ఇంటర్వెల్ లో స్టైలిష్ గా గన్స్ తో ఫైట్ చేస్తాడు. దీనికి చాలా చేంజ్ చూపించాలి. ఈ ఇంటర్వెల్ ఫైట్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ ఒక్క ఫైట్ కోసం 16 రోజులు కష్టపడ్డాం. ఇక ఈ సినిమాలో చిరంజీవి-శృతిహాసన్ కి మధ్య కూడా ఓ సరదా ఫైట్ ఉంటుంది.

Aishwary Rajesh : మహిళా డ్రైవర్ కి ఆటో ఇచ్చిన హీరోయిన్.. మహిళా డ్రైవర్స్ తో కలిసి తన సినిమా స్పెషల్ షో..

అలాగే వీరసింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ కుర్చీలో కూర్చొని ఓ ఫైట్ చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. టర్కీలో వచ్చే మాస్ యాక్షన్ ఫైట్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి అని తెలిపారు.