Rana Naidu : ‘రానా నాయుడు’ని ఫ్యామిలీతో చూడకండి.. రానా, వెంకటేష్!

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. మార్చి 10 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. కాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో.. ఈ సిరీస్ ని ఫ్యామిలీ తో కలిసి చూడకండి అంటూ వెంకటేష్, రానా ఉచిత సలహా ఇస్తున్నారు.

Rana Naidu : ‘రానా నాయుడు’ని ఫ్యామిలీతో చూడకండి.. రానా, వెంకటేష్!

rana daggubati and venkatesh says do not watch rana naidu web series with family

Rana Naidu : ఓటిటి కల్చర్ వచ్చాక ప్రేక్షకులకు వెబ్ సిరీస్ బాగా అలవాటు అయ్యాయి. దీంతో ఇండియన్ ఫిలిం మేకర్స్ కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ పై కూడా ద్రుష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నార్త్ అండ్ సౌత్ లో పలు సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఇటీవల కాలంలో స్టార్ హీరో, హీరోయిన్ లు కూడా వెబ్ సిరీస్ లో నటించేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత, రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, అజయ్ దేవగన్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కూడా వెబ్ సిరీస్ తో వస్తున్నారు.

NTR30: ఆ సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేస్తున్న తారక్-జాన్వీ..?

రానా నాయుడు అనే టైటిల్ తో వస్తున్న ఈ సిరీస్ లో వెంకటేష్, రానా.. తండ్రి-కొడుకులుగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్స్ కరణ్ అన్షమాన్, సువర్ణ్ వర్మ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. అమెరికన్ సిరీస్ ‘రే డోనోవన్’కు ఇది అడాప్టేషన్ గా తెరకెక్కింది. బసుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. మార్చి 10 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. దీంతో వెంకటేష్ అండ్ రానా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

Oscars 2023 : ఆస్కార్ అందుకున్న భారతీయులు ఎవరో తెలుసా?

ఈ క్రమంలోనే ఈ సిరీస్ ని ఫ్యామిలీ తో కలిసి చూడకండి అంటూ వెంకటేష్, రానా ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో రానా మాట్లాడుతూ.. ‘ఓటిటి వచ్చాక సినీ ఇండస్ట్రీ ట్రెండే మారిపోయింది. ఈ క్రమంలోనే చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి ఈ సిరీస్ ని ఫ్యామిలీ తో కలిసి చూడకండి. సింగిల్ గా చూస్తే మంచిది’ అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే వెంకటేష్ మాట్లాడుతూ.. ”రానా మాములోడు కాదు. నేను ఇప్పటికి కూడా చేయని ఎన్నో క్యారెక్టర్స్ వీడు ఇప్పుడే చేసేసాడు. ఇక ప్రస్తుతం ఓటిటిలో ఉన్న కంటెంట్ ని ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నాం. కానీ ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు. రానా నాయుడుని ఫ్యామిలీతో చూడకండి” అంటూ వెల్లడించాడు.