Rangamarthanda : సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఇక్కడ కూడా సైలెంట్ హిట్ కొడుతుందా?
రంగమార్తాండ చూశాక ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయి థియేటర్స్ లో సినిమాని సక్సెస్ చేశారు. ప్రేక్షకులు, అనేకమంది సెలబ్రిటీలు రంగమార్తాండ సినిమా చూసి చిత్రయూనిట్ ని అభినందించారు.

Rangamarthanda movie streaming in Amazon Prime OTT
Rangamarthanda : కృష్ణవంశీ(Krishna Vamsi) దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇటీవల ఉగాది(Ugadi) నాడు మార్చ్ 22న రంగమార్తాండ(Rangamarthanda) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఎక్కువగా ప్రమోషన్స్ చేయకుండానే ఉగాది నాడు రిలీజ్ అయిన ఈ సినిమా సైలెంట్ గా మంచి టాక్ తెచ్చుకొని మౌత్ టాక్ తో విజయం సాధించింది. మరాఠీలో మంచి విజయం సాధించిన నటసామ్రాట్(Nata Smarat) సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేశారు. ప్రకాష్ రాజ్(Prakash Raj) మెయిన్ లీడ్ గా రమ్యకృష్ణ(Ramyakrishna), బ్రహ్మానందం(Brahmanandam), రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj), శివాత్మిక(Shivathmika), అనసూయ(Anasuya), ఆదర్శ్(Adarsh) ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కింది.
మన అమ్మానాన్నల కథ అంటూ తక్కువ ప్రమోషన్స్ తోనే సినిమాని రిలీజ్ చేశారు. అందరి ఇళ్లల్లో జరిగే కథ, ప్రస్తుతం సమాజంలో జరిగే కథని మంచి ఎమోషనల్ కథనంగా మార్చి చూపించారు కృష్ణవంశీ. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సన్నివేశంలోనూ కన్నీళ్లు తెప్పించాడు. రంగమార్తాండ చూశాక ఒక మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయి థియేటర్స్ లో సినిమాని సక్సెస్ చేశారు. ప్రేక్షకులు, అనేకమంది సెలబ్రిటీలు రంగమార్తాండ సినిమా చూసి చిత్రయూనిట్ ని అభినందించారు.
Om Raut : హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఆదిపురుష్ డైరెక్టర్ ప్రత్యేక పూజలు..
థియేటర్ రిలీజ్ లాగే ఓటీటీ రిలీజ్ కి కూడా ప్రమోషన్స్ చేయలేదు రంగమార్తాండ టీం. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే రంగమార్తాండ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేడు ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. చిత్రయూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ అమెజాన్ ప్రైమ్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్స్ లో సైలెంట్ గా సక్సెస్ అయిన రంగమార్తాండ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులని కూడా మెప్పించి సైలెంట్ హిట్ కొడుతుందా చూడాలి. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకుండా రంగమార్తాండ ఓటీటీలో అయినా చూసేయండి.
story of an extraordinary theatre artist and the unexpected changes in his life when he decides to retire ✨#RangaMaarthaandaOnPrime, watch now https://t.co/woDFJ0AJwD pic.twitter.com/0vQgtKa4NB
— prime video IN (@PrimeVideoIN) April 7, 2023